టాలీవుడ్సినిమా

మొహమాటం లేకుండా డైరెక్ట్ గా హీరోనే అడిగేసింది!


మాళవికా మోహనన్. ఈ పేరు తెలుగు అభిమానులకు పెద్దగా తెలియదు. కేరళలో పుట్టిన ఈ హీరోయిన్‌ ఇప్పుడిప్పుడే కెరీర్ను నిర్మించుకుంటోంది. హాట్‌ హాట్‌ అందాలతో యువత గుండెలు కొళ్లగొట్టే ఈ బ్యూటీ తొలుత మలయాళంలో నటించి ఆపై కన్నడ, తమిళ్, హిందీ చిత్రాలు కూడా చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పేట’తో కోలీవుడ్‌కు పరిచయమైన మాళవిక అక్కడ క్రేజ్ సంపాదించుకుంది. ఆ వెంటనే కోలీవుడ్‌లో అగ్ర కథానాయకుడు విజయ్‌ సరసన ‘మాస్టర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం సమ్మర్లోనే రిలీజ్‌ కావాల్సింది.కానీ, లాక్‌డౌన్‌ కారణంగా విడుదల వాయిదా పడింది. సౌతిండియాలో విజయ్‌కు మంచి స్టార్డమ్‌ ఉండడంతో ఈ మూవీపై భారీ అశలే పెట్టుకుందీ హాట్‌ బ్యూటీ.

Also Read: అరివీర భయంకర.. అధీరా!

అందుకే ఇప్పటికే కొన్ని ఆఫర్లు వచ్చినా.. ఈ మూవీ రిలీజైతే తన రేంజ్‌ మారిపోతుందని భావించి వాటికి నో చెప్పింది. మాస్టర్ వచ్చాక పెద్ద సినిమాలకే కమిటవ్వాలని ఫిక్సయింది. దాంతో తనను సంప్రదిస్తున్న పలువురు దర్శక, నిర్మాతలకు నో చెబుతూ వచ్చింది. తెలుగులో రవితేజ హీరోగా ప్లాన్ చేసిన ఓ మూవీలో చాన్స్‌ వచ్చినా పొగరుగా రెజెక్ట్‌ చేసిందట. తీరా మాస్టర్ ఇప్పుడప్పుడే రిలీజయ్యే అవకాశం లేదని తేలింది. ఇంటిదాకా వచ్చినా ఆఫర్స్‌ను రిజెక్ట్ చేయడంతో ఇప్పుడెవరూ మాళవికను సంప్రదించే ప్రయత్నం చేయడం లేదట. దాంతో, దిగొచ్చిన ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇప్పుడు తానే దర్శక, నిర్మాతలు, హీరోలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో తరచూ హాట్‌ ఫొటోలు పోస్ట్‌ చేస్తున్న మాళవిక.. మొహమాటం లేకుండా ఒక్క చాన్స్‌ అని అడుగుతోందట.

Also Read: పూజా హెగ్డే రెచ్చగొడుతున్నా పట్టించుకోని అఖిల్‌

ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో ధనుష్‌ను కూడా అలానే అడిగేసింది మాళవిక. నిన్న (మంగళవారం) ధనుష్‌ పుట్టిన రోజు కావడంతో అతనికి విషెష్‌ చెప్పిందామె. పనిలో పనిగా తన మనసులో మాటను కూడా బయటపెట్టింది. ‘హ్యాపీ బర్త్‌డే ధనుష్‌ సార్. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. మీతో వర్క్‌ చేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నా. ఎవరో ఒకరు మనిద్దరినీ పెట్టి సినిమా తీస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్‌ చేసింది. బహిరంగంగానే ఒక్క చాన్స్‌ ఇప్పించండి అని చెప్పిందామె. మాళవిక పరిస్థితి చూస్తే చేతులు కాలాక… అనే సామేత గుర్తుకొస్తోంది. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ..ముఖ్యంగా హీరోయిన్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. క్రేజ్‌ ఉన్నప్పుడు.. అవకాశం వచ్చినప్పుడే దాన్ని అందిపుచ్చుకోవాలి. కానీ, మాళవిక పని చేయక ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ఆమెను కొంత దురదృష్టం కూడా వెంటాడుతుందని చెప్పాలని. ఎందుకంటే విజయ్‌ దేవరకొండ హీరోగా తమిళ డైరెక్టర్ ఆనంద్‌ అన్నమలై గతేడాది ప్రకటించిన ‘హీరో’ అనే మూవీలో కూడా మాళవిక హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే, విజయ్‌, ఆనంద్‌ మధ్య క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా ఈ చిత్రం నిరవధికంగా వాయిదా పడింది.

Tags
Show More
Back to top button
Close
Close