జాతీయంరాజకీయాలువైరల్

ఫోన్ కు తాళి కట్టిన వరుడు.. వీడియో చూసి తీరాల్సిందే..


కరోనా ఎఫెక్ట్ అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రతీయేటా ఈ సీజన్లో వేలాదిగా పెళ్లిళ్లు జరుగేవి. ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ కొనసాగుతుండటంతో పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. కొందరు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తాము అనుకున్న ముహుర్తానికే పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు జంటలు నాలుగైదురుగా మధ్యలో తుతూమంత్రంగా పెళ్లి చేసుకున్న సంఘటనలు చూశాం. అయితే తాజాగా ఓ పెళ్లిజంట ఆన్ లైన్లో పెళ్లి చేసుకున్నారు. వరుడు పెళ్లి కుమార్తెకు కాకుండా ఫోన్ తాళికట్టడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన శ్రీజిత్ నాదేషన్, అంజనా వివాహాన్ని పెద్దలు జనవరిలో నిశ్చయించారు. అయితే అనుకోని కారణాలతో ఆ పెళ్లి ఏప్రిల్ 26వ తేదికి వాయిదా పడింది. అంజనా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. లాక్డౌన్ వల్ల ఆమె కేరళకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో వీరిద్దరు ముందుగానే వీడియో కాల్ మాట్లాడుకొని ఆన్ లైన్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు పెద్దలను ఒప్పించారు.

వధువు లక్నోలో.. వరుడు కేరళలో ఉండి వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. ఆన్ లైన్లో ఒకరికి ఒకరు ఎదురుగా ఉండగా అంజనా స్నేహితులు, శ్రీజిత్ కుటుంబ సభ్యులు చూస్తుండగా వరుడు ఫోన్ కు తాళికట్టాడు. ఇదే సమయంలో ఆమె తాళిని తనకు మెడకు ఒక ముడి వేసుకొంది. లాక్డౌన్ ముగిసి.. ఆమె కేరళకు చేరుకున్నాక శ్రీజిత్ మరో రెండు ముళ్లు వేస్తాడని.. ఆ తర్వాత బంధువులకు మ్యారేజ్ రిసెప్షన్ ఇవ్వనున్నట్లు శ్రీజిత్ కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రాండ్ గా జరగాల్సిన పెళ్లి కాస్తా లాక్డౌన్లో కారణంగా అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి మాదిరిగా మారిపోయిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.