టాలీవుడ్బాలీవుడ్సినిమా

అనుష్కపై జర్నలిస్టు వ్యంగ్యాస్త్రం.. మారుతి స్ట్రాంగ్ కౌంటర్

ఓ మహిళా జర్నలిస్టు మాత్రం అనుష్క షేర్ చేసిన ఫొటోపై వ్యంగ్యాస్త్రాన్ని సంధించింది. దీనిపై టాలీవుడ్ దర్శకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాలీవుడ్ నటి అనుష్క.. భారత్ కెప్టెక్ విరాట్ కోహ్లి దంపతులు సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు.. లాక్డౌన్ సమయంలో విరుష్క జోడీ అభిమానులను అలరించారు. కోహ్లి-అనుష్కలు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ తమ అనుభవాలను ఫొటోలు, వీడియోలతో షేర్ చేస్తూ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంటారు. ఎప్పటికప్పుడు అభిమానులతో అమ అనుభవాలను షేర్ చేసుకోవడం ఈ జంట ముందు వరుసలో ఉంటుంది.

Also Read: అదిరిపోయే ‘పాట’ పాడుతున్న మహేష్?

అనుష్క శర్మ తాను తల్లిని కాబోతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై అభిమానులందరూ కోహ్లి-అనుష్క దంపతులకు బెస్ట్ విషెష్ చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఓ మహిళా జర్నలిస్టు మాత్రం అనుష్క షేర్ చేసిన ఫొటోపై వ్యంగ్యాస్త్రాన్ని సంధించింది. దీనిపై టాలీవుడ్ దర్శకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మహిళా జర్నలిస్టుకు అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చాడు.

అనుష్క పంపిన ఫొటోపై ఓ మహిళా జర్నలిస్టు స్పందిస్తూ.. ‘అతను మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశాడు.. ఇంగ్లండ్‌కు మహారాణిని చేయలేదు.. మరీ, అంత సంబరపడకండి’ అంటూ కామెంట్ చేసింది. దీనిపై దర్శకుడు మారుతి తనదైన శైలిలో స్పందించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: నాగబాబూ.. మరీ ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అవసరమా?

‘ఓ మహిళా జర్నలిస్ట్ అయిన మీరు ఇలాంటి కామెంట్ చేయడం చాలా విచారకరం.. ఇంగ్లండ్‌కు మహారాణి కావడం కంటే ఓ బిడ్డకు తల్లి కావడం ఓ మహిళకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.. ప్రతీ మహిళా ఒక మహారాణే. సంతోషంతో నిండిన ప్రతి ఇల్లూ ఓ గొప్ప సామ్రాజ్యమే.. ఆమె సెలబ్రిటీ కాక ముందు ఓ సాధారణ మహిళ.. తల్లి కాబోతున్న క్షణాలను ఆస్వాదించే హక్కు ఆమెకు ఉందని’ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. నెటిజన్లు కూడా మారుతికే మద్దతు తెలిపారు.

Back to top button