టాలీవుడ్సినిమా

మళ్లీ బూతు కామెడీ బాటలోకి మారుతి!


తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన యువ దర్శకుల్లో మారుతి ఒకడు. ఆయన ఖాతాలో ‘భలే భలే మగాడివోయ్‌’, ‘ప్రతి రోజు పండగే’ లాంటి హిట్లున్నాయి. సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేశ్‌ను సైతం డైరెక్ట్‌ చేశాడు. కానీ, మారుతి పేరు చెప్పగానే కెరీర్ తొలినాళ్లలో ఆయన తీసిన ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్‌’ సినిమాలే గుర్తొస్తాయి. ఈ రెండు చిత్రాలూ విజయం సాధించి మారుతి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశాయి. కానీ, ఈ రెండూ బూతు కామెడీ చిత్రాలుగా విమర్శలను ఎదుర్కొన్నాయి. మారుతిపై బూతు కామెడీ సినిమాల డైరెక్టర్ అన్న ముద్ర పడింది.

Also Read: పాపకి పశ్చాత్తాపం ఎక్కువైంది !

కానీ, కొంచెం పేరు వచ్చిన తర్వాత అలాంటి జానర్కు మారుతి పూర్తిగా దూరమయ్యాడు. కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నాం చేశాడు. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ గా కూడా మారాడు. తాను కథ అందించి, సహ నిర్మాతగా వ్యవహరించిన ‘ప్రేమ కథా చిత్రం’తో పాటు ‘కొత్త జంట’తో అలరించాడు. ఇక, ఒక్క డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌ లేకుండా తీసిన ‘భలే భలే మగాడివోయ్‌’తో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు మారుతి. ఆ తర్వాత ‘బాబు బంగారం’, ‘మహానుభావుడు’, ‘శైలజా రెడ్డి అల్లుడు’, ‘ప్రతి రోజు పండగే’ చిత్రాలతో కూడా కుటుంబ ప్రేక్షులను మెప్పించే ప్రయత్నం చేశాడు.

Also Read: గుడ్‌ లక్‌ సఖి టీజర్ వచ్చేసింది.. కీర్తి అదరగొట్టేసింది

ఇలా, తన ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో మారుతి మళ్లీ పాత దారిని ఎంచుకున్నాడు. మరోసారి బూతు కామెడీ… అదే అడల్ట్‌ కామెడీ జానర్లోకి వెళ్తున్నాడు. చదువుకున్న, నగర ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చాడు. దానికి ‘3 రోజెస్‌’ అనే టైటిల్‌ పెట్టాడు. ఇందులో రెజీనా కెసాండ్రా, పూర్ణ, ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తున్నారు. దీన్ని వెబ్‌ సిరీస్‌ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు మారుతి. అయితే, దీనికి అతను దర్శకత్వం వహించడం లేదు. తానే కథ, డైలాగ్స్‌ అందించి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. కొత్త వ్యక్తి మ్యాగి డైరెక్షన్‌లో ఈ వెబ్ సిరీస్‌ ముందుకు రానుంది. ఈ సిరీస్‌ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే, కుటుంబ ప్రేక్షకులకు చేరువైన తర్వాత ఈ అడల్ట్‌ కామెడీ ప్రాజెక్టును మారుతి ఎలా హ్యాండిల్‌ చేస్తాడో చూడాలి.

Tags
Back to top button
Close
Close