తెలంగాణరాజకీయాలు

కరోనా మృతదేహాలకు దిక్కులేని దుస్థితి?

Medical staff negligence on corona bodies

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. లెక్కలేనన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గంట కింద ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒకే సారి మరణిస్తుండడంతో విషాద ఛాయలు నెలకొంటున్నాయి. ఇదిలా ఉండగా కరోనాతో చనిపోయిన వ్యక్తుల కుటుంబాల్లో తీరని దు:ఖం నెలకొంటోంది.

కడసారి చూపు లేకపోవడంతో వారి ఆర్తనాదాలకు అడ్డుకట్టలేకుండా పోతోంది. అయితే ఇంతటి బాధలో ఉన్న కొన్ని కుటుంబాలు కొందరు వైద్యులు చేసే నిర్ణక్ష్యంతో మరింత శోకాన్ని పొందుతున్నాయి. కరోనా గురించి సంవత్సరంగా స్టడీ చేస్తున్నా కొందరు వైద్య సిబ్బంది అవగాహన రాహిత్యంతో అనేక మృతుల బంధువులు శోకసంద్రంలో మునుగుతున్నాయి.

కరోనాతో మరణించిన వ్యక్తుల మృతదేహాలను ప్రారంభంలో కుటుంబాలకు అప్పగించలేదు. అయితే జాగ్రత్తలు తీసుకుంటూ సాంప్రదాయంగా అంత్యక్రియలు చేసుకొవచ్చని ప్రభుత్వాలు తెలపడంతో కొందరు అలాగే చేస్తున్నారు. దీంతో కొంతైనా బంధువుల్లో వేదన తీరుతుందని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే కరోనాతో చనిపోయిన మృతదేహాలను అప్పగించడంలో కొందరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బంధువుల్లో తీవ్ర విషాద ఛాయలు నెలకొంటున్నాయి.

తాజగా సిద్ధిపేట జిల్లాలోని చేర్యాల మండలానికి చెందిన వజ్రమ్మ అనే వృద్ధురాలు కరోనాతో మరణించింది. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా వారు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు జరిపించారు. అయితే ఇక్కడ వైద్య సిబ్బంది ఓ మిస్టేక్ చేశారు. వజ్రమ్మ పేరుతో ఉన్న మరో మృతదేహాన్ని తారుమారు చేశారు. దీంతో అసలు బాధితులు విషయం తెలియగానే లబోదిబోమన్నారు. వైరస్ కారణంగా చనిపోయిన వ్యక్తుల గురించి దు:ఖంలో మునిగి ఉంటే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరింత శోకాన్ని మిగిలిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Back to top button