విద్య / ఉద్యోగాలు

కంటోన్మెంట్ బోర్డులో 35 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో..?

Medical Staff Recruitment

సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ బోర్డ్ అనుభవం ఉన్న ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కోవిడ్ ఆస్పత్రిలో వివిధ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, సూప‌ర్‌వైజ‌ర్‌, న‌ర్సింగ్ ఇన్‌చార్జి, ఇతర ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల కాగా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

https://secunderabad.cantt.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే నెల 17వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. మొత్తం 35 ఉద్యోగ ఖాళీలలో జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, సూప‌ర్‌వైజ‌ర్‌, న‌ర్సింగ్ ఇన్‌చార్జి, న‌ర్సింగ్ స్టాఫ్, ఇతర ఉద్యోగాలు ఉన్నాయి.

డిప్లొమా, జీఎన్ఎం లేదా బీఎస్సీ (న‌ర్సింగ్‌), ఎంబీబీఎస్‌, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌లో ఎండీ ఉత్తీర్ణులై అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అనుభవం కచ్చితంగా ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ceo.seb2009@gmail.com ఈ మెయిల్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుంది.

కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావడంతో కరోనా కేసులు తగ్గిన తరువాత ఎంపికైన ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉంటాయి.

Back to top button