టాలీవుడ్సినిమా

ఇష్యూలోకి ఎన్టీఆర్ ను లాగిన పవన్ హీరోయిన్

Meera Chopra lodges complaint against NTR fans  https://www.thehansindia.com/cinema/tollywood/meera-chopra-lodges-complaint-against-ntr-fans

లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రెటీలు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ ఉంటున్నారు. క్వారంటైన్లో తమ అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ తో ‘బంగారం’ మూవీలో నటించిన మీరా చోప్రా ట్వీటర్లో అభిమానులతో లైవ్ చాట్ చేశారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఓ అభిమాని మీకు తెలుగులో ఏ హీరో అంటే ఇష్టమని ప్రశ్నించాడు. దీనికి ఆమె మహేష్ బాబు పేరు చెప్పింది. అనంతరం ఎన్టీఆర్ గురించి ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి ఆమె ‘నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదని.. నాకు ఎన్టీఆర్ కంటే మహేష్ అంటేనే ఇష్టమని’ సమాధానం ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం ఇష్టమొచ్చిన రీతిలో బూతుపురాణం విప్పారు.

రెండ్రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెతోపాటు ఆమె తల్లిదండ్రులను కూడా తీవ్రపదజాలంతో దూషిస్తుండటంపై మీరా చొప్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఎన్టీఆర్ ను కూడా ఇష్యూలోకి లాగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చను ఎన్టీఆర్ కు ట్యాగ్ చేస్తూ పోస్టుచేసింది. ‘నాకు ఎన్టీయర్ కంటే మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టం అన్నందుకు ‘వేశ్య’, ‘పోర్న్‌స్టార్’, ‘తిరుగుబోతు’ అంటూ బూతులు తిడుతున్నారని.. గ్యాంగ్‌రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారని.. ఆమె తల్లిదండ్రులకు కూడా అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పెడుతున్నారని ట్వీటర్లో పోస్టు చేసింది. ఇలాంటి ఫ్యాన్స్ తో మీరు విజయవంతమైనట్టు భావిస్తున్నారా? మీరు నా ట్వీట్‌కు స్పందిస్తారని అనుకుంటున్నా’ అంటూ మీరా ట్వీట్ చేసింది.

రెండ్రోరోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రాను టార్గెట్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. చివరికి మీరా చొప్రా సైబర్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆన్ లైన్లో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీరాకు సింగర్ చిన్మయి, ఇతర నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఇష్యూలో స్పందించాలని మీరా చొప్రా ఎన్టీఆర్ ను కోరింది. అయితే దీనికి ఎన్టీఆర్ ఇంతవరకు ఆమెకు ఎలాంటి రిప్లయ్ ఇవ్వలేదు. ఈ ఇష్యూపై ఎన్టీఆర్ ఎలా రియాక్టవుతాడో వేచి చూడాల్సిందే..!