సినిమా వార్తలు

ఫ్యామిలీ హీరోయిన్ దీనస్థితి.. పాపం ఛాన్స్ ల కోసం !

Meera Jasmin
మీరా జాస్మిన్ అనగానే ఫ్యామిలీ రోల్స్ గుర్తుకువస్తాయి. అంతగా ఆమె ఫ్యామిలీ హీరోయిన్ గా చలామణి అయింది. డీసెంట్ క్యారెక్టర్స్ లో ఆమె అలరించినా… యువ లాంటి సినిమాల్లో హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుకి నిద్ర కూడా లేకుండా చేసింది. ఏది ఏమైనా మీరా జాస్మిన్ కి ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పవన్ కళ్యాణ్, విక్రమ్, రవితేజ, విశాల్ వంటి పెద్ద హీరోల సరసన ఆడిపాడింది.

సౌత్ లో తెలుగు, తమిళ సినిమా రంగాల్లో ఫుల్ క్రేజ్ తో వరుస హిట్స్ అందుకుని.. దాదాపు పదేళ్ల పాటు ఫుల్ బిజీగా సినిమాలు చేసింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ సీనియర్ ఫ్యామిలీ హీరోయిన్.. ఇప్పుడు మళ్ళీ సినిమా కెరీర్ పై ఫోకస్ పెట్టిందని.. ప్రస్తుతం తన మకాంను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేసుకుందని.. గతంలో తనతో సినిమాలు చేసిన హీరోలను దర్శకులను కలిసి మీ సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వండి అంటూ మీరా అందర్నీ రిక్వెస్ట్ చేస్తోందట.

ఉన్నట్టు ఉండి మీరా జాస్మిన్ సినిమాల పై ఫోకస్ పెట్టడానికి గల కారణం.. ఆర్ధిక ఇబ్బందులు అట. ఆమె తన భర్త నుంచి విడిపోయిందని.. అలాగే ఆమెకు కొన్ని ఆర్ధిక ఇబ్బందులు కూడా ఉన్నాయని.. ఆమెను కొంతమంది కుటుంబ సభ్యులే మోసం చేశారని.. దాంతో సేవింగ్స్ అన్ని వడ్డీలకే కట్టాల్సి వచ్చిందని.. ప్రస్తుతం సినిమాల్లో తిరిగి నటించడం తప్ప.. ఆమెకు మరో ఆప్షన్ లేదని.. అందుకే అవకాశాల కోసం అందర్ని రిక్వెస్ట్ చేస్తోందని తెలుస్తోంది.

అన్నట్టు ఒకప్పుడు మీరా జాస్మిన్ బొద్దుగా ఉండేది. ఇప్పుడు బాగా చిక్కిపోయింది. పై ఫోటో ఆమె లేటెస్ట్ ఫోటో. ఆమెని గుర్తు పట్టలేనంతగా ఆమె మారిపోయింది. ఆమె ఇప్పటికే మలయాళంలో ఒక మూవీ చేస్తోంది.

Back to top button