టాలీవుడ్సినిమా

సైరా దర్శకుడికి నో చెప్పిన ‘మెగా’ హీరో?

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు ‘సైరా’ను దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో తెలుగులో భారీ విజయం సాధించింది. అయితే మిగతా భాషల్లో ‘సైరా’ అనుకున్నంత ఫలితాన్ని సాధించలేదు. భారీ బడ్జెట్ తో ‘బహుబలి’ మూవీ రేంజ్లో కలెక్షన్లు రాబడుతుందనకున్నా అది జరగలేదు. అయితే సైరా నర్సింహారెడ్డి జీవితగాథను తెరకెక్కించడంలో సురేందర్ రెడ్డి, మెగాస్టార్ ఇద్దరు సక్సస్ అయ్యారు. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డితో నటించేందుకు ఓ మెగా హీరో నో అన్నాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

‘సైరా’ తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి మరో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించేందుకు కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ కథను ప్రభాస్ దగ్గరికి తీసుకెళ్లాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ బీజీగా ఉండటంతో రెండేళ్ల సమయం పట్టేలా ఉంది. దీంతో ఈ మూవీలో నటించాలని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇటీవల సురేందర్ రెడ్డి నిర్మాత రాంచరణ్ కు ‘సైరా’ విషయంలో గొడవ జరిగిందని, దీంతో సురేందర్ రెడ్డి దర్శక-నిర్మాత మండలిలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమోగానీ తెలియదుగానీ వరుణ్ తేజ్ ఈ కారణంగానే సురేందర్ రెడ్డి మూవీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి, రాంచరణ్ చాలా సన్నిహితంగా ఉంటాడు. రాంచరణ్ తో కలిసి ‘ధృవ’ మూవీని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో సురేందర్ పనితనం నచ్చి మెగాస్టార్ ‘సైరా’ మూవీకి దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఈ మూవీలో తెలుగులో భారీ కలెక్షన్లు రాబట్టిన హిందీలో నిరాశ పరిచింది. ఈ మూవీ విషయంలో రాంచరణ్, మెగాస్టార్ హ్యాపీగానే ఉన్నారు. కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పలువురు అంటున్నారు. అయితే సురేందర్ ప్యాన్ ఇండియా మూవీలో వరుణ్ తేజ్ నటిస్తారా? లేదా అనేది మాత్రం త్వరలోనే తేలనుంది.