గుసగుసలుసినిమా

Ram charan Car: రాంచరణ్ విదేశాల నుంచి కొన్న స్పెషల్ కారు ధర ఎంతో తెలిస్తే అవాక్కే

మెగా పవర్ స్టార్ సైతం ముచ్చటపడి సపరేట్ గా తయారు చేయించుకొని మరీ ఒక ఖరీదైన బెంజ్ కారు కొనేశాడు. విశేషం ఏంటంటే తనకు నచ్చినట్టుగా ఆకారును రాంచరణ్ డిజైన్ చేయించుకోవడం విశేషం.

Ram charan Car: పుర్రెకో బుద్ది ఉంటుంది. సామాన్యుడికి తన జీవితకాలంలో ఒక చిన్న మారుతి 800 కొనడానికే తల ప్రాణం తోకకు వస్తుంది. అది మాన సంపాదనపై ఆధారపడి ఉంటుంది. సంపద పెరిగితే కొంటాం.. లేదంటూ ఉసూరుమంటాం. అయితే మన అభిమానించే తారలు అలా కాదు.. వారి వ్యాపకాలే వేరుగా ఉంటాయి. స్పోర్ట్స్ బైక్ లు, స్పోర్ట్స్ కార్లు, లగ్జరీ కార్లు అంటే ఎందుకో మన స్టార్ హీరోలకు పిచ్చి ప్రేమ.

మొన్నీ మధ్యే కోట్లు పెట్టిన మన జూనియర్ ఎన్టీఆర్(NTR) కొన్న లాంబోర్ఘీని కారు గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. అలాంటి ఖరీదైన కార్లు ఎన్నో ఎన్టీఆర్ గ్యారేజీలో ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో ఇలాంటి కార్ల పిచ్చి నాగచైతన్య, రాంచరణ్, సాయిధరమ్ తేజ్ లాంటి స్టార్ హీరోలకు ఉందట..

తాజాగా మెగా పవర్ స్టార్ సైతం ముచ్చటపడి సపరేట్ గా తయారు చేయించుకొని మరీ ఒక ఖరీదైన బెంజ్ కారు కొనేశాడు. విశేషం ఏంటంటే తనకు నచ్చినట్టుగా ఆకారును రాంచరణ్ డిజైన్ చేయించుకోవడం విశేషం. ఈ స్పెషల్ డిజైన్డ్ బెంజ్ కారును తాజాగా రాంచరణ్(Ram charan)కు కంపెనీ అందజేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అవుతోంది.

రాంచరణ్ న్యూ బెంజ్ కారు లుక్ అదిరిపోయిందంటే నెటిజన్లు,అభిమానులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇంతకీ రాంచరణ్ కొన్న కారు ఏంటో తెలుసా? ‘మెర్సిడేజ్ మేబాచ్ జీఎల్ఎస్ 600 మోడల్’.. దీని ఖరీదు తెలిస్తే మీ గుండె కలుక్కుముంటుంది. దాదాపు ఈ ఖరీదైన కారు ధర రెండున్నర కోట్లు.. బాప్ రే.. అంత ధరనా అని నోరెళ్లబెట్టకండి. రాంచరణ్ రేంజ్ అదీ మరీ.. త్వరలో ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోతున్నాడు కదా.. ఆ మాత్రం కారు ఉండాల్సిందే..

ముచ్చటపడి కొన్న ఈ కారును రాంచరణ్ తొలి సారి కొద్దిసేపు డ్రైవ్ చేశాడు. చరణ్ న్యూ బెంజ్ కారు లుక్ అదుర్స్ లా ఉంది. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

Back to top button