టాలీవుడ్ప్రత్యేకంసినిమాసినిమా వార్తలు

Megastar Chiranjeevi Birthday Specials : మెగాస్టార్ బర్త్ డేకి 4 స్పెషల్ ఎనౌన్స్ మెంట్స్

తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టిన రోజు వస్తుంది అంటే... ఆ రోజు దాదాపు పది మంది హీరోలకు, పది - పదిహేను మంది డైరెక్టర్లకి ప్రత్యేక రోజు.

Chiranjeeviతెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టిన రోజు వస్తుంది అంటే… ఆ రోజు దాదాపు పది మంది హీరోలకు, పది – పదిహేను మంది డైరెక్టర్లకి ప్రత్యేక రోజు. చిరు ఇచ్చే పార్టీ కోసం వారంతా ఆ రోజు షూటింగ్స్ ను కూడా రద్దు చేసుకుంటారు. మరి చిరు పుట్టినరోజు దగ్గర పడుతుంది. ఈ సారి ఎలాంటి హడావుడి ఉంటుందో చూడాలి. అయితే, ఫ్యాన్స్ కు మాత్రం చిరు ఫుల్ కిక్ ఇవ్వబోతున్నారు.

మెగాస్టార్ బర్త్ డే అంటే.. అభిమానులకు ఒక పండగ, కాలం మారినా, తరాలు మారినా ఎపుడు అదే కోలాహలం, ఎప్పటికీ అదే ఉత్సాహం. అందుకే ఇప్పటికీ చిరు తన సినిమాల దూకుడును ఏ మాత్రం ఆపలేదు. ఈ సారి పుట్టిన రోజున ఏకంగా నాలుగు చిత్రాలకు సంబంధించిన బిగ్ అప్ డేట్స్ ఇవ్వబోతున్నారు.

ఆ అప్ డేట్స్ లో ప్రముఖమైనది ‘గాడ్ ఫాదర్’ గురించి రానున్న అధికారిక ప్రకటన. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’ను చిరు తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘గాడ్ ఫాదర్’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. పైగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా నుండి బిగ్ ఎనౌన్స్ మెంట్ చిరు పుట్టిన రోజు నాడు రానుంది.

ఇక మరో కీలక ఎనౌన్స్ మెంట్ ఆచార్య(Acharya) రిలీజ్ డేట్. అక్టోబర్ 1న ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇక మెగాస్టార్ మరో సినిమా మెహెర్ రమేష్ డైరెక్షన్ లో చేస్తున్నారు. తమిళ ‘వేదాళం’ సినిమాని రీమేక్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ కూడా చిరు పుట్టినరోజు నాడు పోస్టర్ ద్వారా రివీల్ చేయనున్నారు.

ఇక దర్శకుడు బాబీ – మైత్రి మూవీ మేకర్స్ కలయికలో వస్తున్న సినిమా షూట్ కి కూడా మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి చిరు లుక్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Back to top button