అప్పటి ముచ్చట్లుసినిమా వార్తలు

Chiranjeevi: ఆ హీరోయిన్ కి తెలుగు నేర్పిన చిరంజీవి !

Mega Star Chiranjeevi
చిరంజీవితో ‘న్యాయం కావాలి’ సినిమా చేయాలని నిర్మాత క్రాంతికుమార్ గారు సన్నాహాలు చేస్తోన్న రోజులు అవి. అప్పటికే రెండు నెలలు నుండి హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. సినిమాలో హీరోయినే మెయిన్. ఆ కీలకమైన పాత్ర చుట్టూనే సినిమా సాగుతుంది. అందుకే ఎవరిని హీరోయిన్ గా తీసుకోవాలో క్రాంతి కుమార్ గారికి అర్థం కాలేదు.

అందుకే చాలా కాలం పాటు హీరోయిన్ విషయంలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా చాలా మంది పేర్లు అనుకున్నారు. చివరకు హీరోయిన్ మాధవి పేరును ఖరారు చేశారు. ఆమెకు కథ చెప్పారు. అప్పటికీ మాధవి కమల్ హాసన్ సినిమా చేస్తోంది. చిరంజీవి హీరో అనేసరికి ఆమె డేట్లు ఇవ్వలేదు. నిజానికి అంతకుముందే చిరంజీవితో ‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’ అనే సినిమా చేసింది మాధవి.

అయితే, ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో మాధవి చిరుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఐతే, ఎలాగూ హీరోయిన్ పాత్ర కీలకం కాబట్టి, ఆ పాత్ర పరిధిని కొంచెం పెంచి శ్రీదేవిని సినిమా చేయడానికి ఒప్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది దర్శకుడు కోదండరామిరెడ్డికి.

శ్రీదేవి అయితే బడ్జెట్ పెరిగిపోతుంది అంటూ క్రాంతి కుమార్ గారు ఆ ఆలోచనను ఇష్టపడలేదు. చివరకు కొత్త అమ్మాయి అయితే, ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే పని లేదు అని హీరోయిన్ రాధికను ఫైనల్ చేశారు. రాధికకు తెలుగులో తొలి సినిమా ‘న్యాయం కావాలి’నే. షూట్ కి వచ్చింది రాధికా. ఒక్క డైలాగ్ కూడా సరిగ్గా చెప్పడం లేదు. కారణం తెలుగు అసలు రాకపోవడమే.

ఇక దాంతో ఆమెకు తెలుగు నేర్పించడం కోసం ఓ ట్యూటర్‌ ను పెట్టారు. అయితే రాధికా మాత్రం ఆ ట్యూటర్ దగ్గర కంటే.. చిరంజీవి దగ్గరే ఎక్కువ తెలుగు నేర్చుకున్నారు. ఎలాగోలా సినిమా పూర్తి అయి రిలీజ్ అయింది. ‘న్యాయం కావాలి’ సినిమా రాధికకు గొప్ప పేరు తెచ్చి పెట్టింది. ఏది ఏమైనా ఈ సినిమా షూట్ సమయంలో చిరంజీవి రాధికకు తెలుగు నేర్పించారు.

Back to top button