టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

‘గుండు’ సీక్రెట్ ను రివీల్ చేసిన మెగాస్టార్..!

ఈ గుండు వెనుక ఉన్న తతాంగాన్ని చిరంజీవి తన ఇన్ స్ట్రాగ్రాములో పోస్టు చేసి రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి గుండు ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చిరంజీవిని గుండులో చూసి అభిమానులు, సీని ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. చిరంజీవి పాత్రల కోసం ఏమైనా చేస్తారంటూ పలువురు ప్రసంశలు కురిపించారు. తాజాగా చిరంజీవి దీనిపై స్పందిస్తూ తనది రియల్ గుండు కాదని స్పష్టం చేశారు. గుండు వెనుక ఉన్న సీక్రెట్ ను రివీల్ చేసి అందరినీ షాక్ కు గురిచేశారు.

Also Read: ‘ఆచార్య’తో అమ్మ కలను నెరవెరుస్తున్న చరణ్..!

‘సైరా’ మూవీ తర్వాత చిరంజీవి చేస్తున్న తాజాగా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ షూటింగు శరవేగంగా జరుపుకుంటున్న క్రమంలోనే కరోనా ఎఫెక్ట్ తో సినిమా వాయిదా పడింది. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మెగాస్టార్ సోషల్ మీడియా మాత్రం యాక్టివ్ ఉంటున్నారు. ఓవైపు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే.. మరోవైపు అభిమానులతో తన రోజువారీ అనుభవాలను పంచుకుంటున్నారు.

ఇటీవల చిరంజీవి గుండు లుక్ లో కన్పించారు. చిరంజీవి ‘ఆచార్య’ డబుల్ రోల్ చేస్తుండటంతో ఓ పాత్ర కోసం మెగాస్టార్ గుండు గీయించుకున్నారని ప్రచారం జరిగింది. మరికొందరేమో చిరంజీవి ఓ వెబ్ సీరిస్ నటించేందుకు గుండు గీయించుకున్నారంటూ గాసిప్ లు సృష్టించారు. ఈ గుండు ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ గుండు వెనుక ఉన్న తతాంగాన్ని చిరంజీవి తన ఇన్ స్ట్రాగ్రాములో పోస్టు చేసి రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Also Read: కంగానాకు భద్రతపై లాయర్‌‌ ఫైర్‌‌.. కంగనా రిటర్న్‌ కౌంటర్‌‌

తాను ఏ సినిమా కోసం గుండు చేయించుకోలేదని మెగాస్టార్ స్పష్టం చేశారు. ఇటీవల కన్పించిన గుండు లుక్కు నిజానికి మేకప్ అంటూ అందరినీ షాక్ కు గురిచేశారు. మేకప్ నిపుణులు తన లుక్కును అలా మార్చారని.. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేశాడు. ఇదే సినిమా మ్యాజిక్ అని తేల్చిచెప్పారు. ఇక త్వరలోనే ‘ఆచార్య’ కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.

Back to top button