అత్యంత ప్రజాదరణజాతీయంరాజకీయాలు

ఘనంగా క్రిస్మస్.. ముస్తాబైన చర్చిలు.. ప్రముఖుల శుభాకాంక్షలు

Merry Christmas .. Happy Churches .. Celebrity Greetings

డిసెంబర్ 25.. ప్రపంచవ్యాప్తంగా పండుగ రోజు. కరుణామయుడు ఏసు క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చీలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాకాంతులతో ప్రార్థన మందిరాల్లో క్రిస్మస్ శోభ వెల్లివిరుస్తోంది.

నిన్న రాత్రి నుంచే క్రిస్టియన్లు చర్చిల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకుంటున్నారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో చర్చిల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా దేశ పౌరులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యం వెల్లివిరియాలని కోరుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. క్రీస్తు బోధనలు, ప్రేమ, కరుణ, మానవత్వంతోకూడిన బోధనలతో సమాజాన్ని నింపుదామన్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద వాటిల్లో ఒకటైన మెదక్ చర్చిలో ప్రార్థనలు వైభవంగా ాసగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సైతం ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

క్రిస్మస్ సందర్భంగా తెలుగురాష్ట్రాల గవర్నర్లు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ కూడా ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారాలోకేష్, జనసేన అధినేత పవన్ సైతం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట్లో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులంతా చేసుకున్న వేడుకల ఫొటోలను తాజాగా అమితాబ్ షేర్ చేశారు.

Back to top button