జాతీయం - అంతర్జాతీయం

అరేబియాలో కూలిన మిగ్-29 విమానం

MiG-29 crashes in Arabia in india

రోజువారి శిక్షణలో భాగంగా గాలిలోకి ఎగిరిన భారత శిక్షణ విమానం అరెబియా సముద్రంలో కూలిపోయింది. ఇందులో ఇద్దరు ఫైలట్లు ఉండగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మరొకరి ఆచూకీ లభించలేదు. దక్షిణ గోవాలోని ఐఎన్ఎస్ నుంచి బయలుదేరిన మిగ్-29 విమానం గురువారం సాయంత్రం గాలిలోకి ఎగిరింది. కొంత దూరం వెళ్లగానే నేరుగా సముద్రంలోకి కూప్పకూలింది. కాగా తప్పిపోయిన ఫైలట్ కోసం గాలిస్తున్నామని నేవీ అధికారులు తెలిపారు. గతంలోనూ మిగ్-29 విమానం కుప్పకూలింది. అయితే అప్పడు ఉన్న ఫైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

Back to top button