తెలంగాణరాజకీయాలు

KTR : హైదరాబాదీ అందంకు మంత్రి కేటీఆర్ ఫిదా

ఎమ్మెల్యే కాలనీలో జీహెచ్ఎంసీ చేపట్టిన లోటస్ పాండ్ పార్క్ అభివృద్ధి ఫొటోలను జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ట్విట్టర్ లో షేర్ చేయగా.. మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.

అది హైదరాబాద్ లోని బంజారాహిల్స్. కానీ ఫొటోలు చూస్తే మాత్రం ఇది హైదరాబాద్ అని ఎవరూ నమ్మరు. అంతలా అలరించేలా విదేశీ లుక్ తీసుకువచ్చింది జీహెచ్ఎంసీ. మంత్రి కేటీఆర్ నే ఫిదా చేసింది.

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో గల లోటస్ పాండ్ కొత్త రూపు సంతరించుకుంది. జీహెచ్ఎంసీ అధికారుల కృషితో లోటస్ పాండ్ పార్క్ సర్వాంగ సుందరంగా తయారైంది. అచ్చం విదేశాల్లో ఉండేలా మారిపోయింది. నీటి స్వచ్ఛత కోసం ఏరేటర్లు, సందర్శకులను ఆకట్టుకునేలా నీటి మధ్యలో ఐ ల్యాండ్స్ ఏర్పాటు చేశారు. చుట్టూ వాకింగ్ ట్రాక్ తోపాటు సుందరవనంగా మారిన తీర ప్రాంతంలో సందర్శకులు సేదతీరేందుకు బెంచీలు ఏర్పాటు చేశారు.

ముఖ్యంగా హైదరాబాద్ లోని పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ లోటస్ పాండ్ కు మరిన్ని అందాలు తీసుకొచ్చింది. ఎమ్మెల్యే కాలనీలో జీహెచ్ఎంసీ చేపట్టిన లోటస్ పాండ్ పార్క్ అభివృద్ధి ఫొటోలను జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ట్విట్టర్ లో షేర్ చేయగా.. మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.

‘గ్రేట్ జాబ్.. ఇలాంటివి మరిన్ని చేయాలని’ జీహెచఎంసీ అధికారులకు సూచించారు. మంత్రి కేటీఆర్ షేర్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఇది హైదరాబాద్ లోనా? లేక విదేశాల్లోనా? అన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు.

Back to top button