విద్య / ఉద్యోగాలు

458 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.56,900 జీతంతో?

Ministry of Defense Jobsభారత రక్షణ మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 458 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలలో ట్రేడ్స్ మెన్, జేఓఏ, మెటీరియల్ అసిస్టెంట్, ఎంటీఎస్, ఫైర్ మెన్, ఇతర ఉద్యోగ ఖాళీలు ఉండగా అర్హత, ఆసక్తిని బట్టి ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన వచ్చిన 21 రోజుల తర్వాత ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. https://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 458 ఉద్యోగ ఖాళీలలో ట్రేడ్స్ మెన్ మేట్ విభాగంలో 330 ఖాళీలు ఉన్నాయి. పది పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 56,900 వేతనం లభిస్తుంది.

జేఓఏ ఉద్యోగాలలో 20 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు నెలకు 19,900 రూపాయల నుంచి 56,900 రూపాయల వేతనం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు మెటీరియల్ అసిస్టెంట్ విభాగంలో 19 ఖాళీలు ఉండగా గ్రాడ్యుయేషన్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంటీఎస్ పాసైన వాళ్లకు 11 ఖాళీలు ఉండగా పది అర్హతతో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైర్ మేన్ ఉద్యోగ ఖాళీలు 64 ఉండగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. ఏబీఓయూ ట్రేడ్స్ మెన్ మేట్ ఉద్యోగ ఖాళీలు కూడా 14 ఉండటం గమనార్హం.

Back to top button