జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా

MLA quota MLC elections postponed

రెండు తెలుగు రాష్ట్రాల్లో ని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వల్ల వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. మే 31తో ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు జూన్ 3తో తెలంగాణలో ఆరు స్థానాలు ఖాళీ కానున్నవి. తెలంగాణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైఎస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, సభ్యులు కడియం శ్రీహరి, ఫరీరుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు పదవీ కాలం పూర్తి అవుతుంది.

Back to top button