అంతర్జాతీయంరాజకీయాలు

గుడ్ న్యూస్.. తుది దశకు చేరుకున్న వ్యాక్సిన్ ట్రయల్స్


ఒక్క వైరస్.. ప్రపంచాన్ని బెంబేలేత్తిస్తోంది. కంటికి కన్పించకుండా.. ఉసరవెల్లిగా రంగులు మారస్తూ మానవాళికి సవాల్ విసురుతోంది. నింగి.. నేలను ఆక్రమించుకొని భూమిపై పెత్తనం చేస్తున్న మానవుడా.. నన్ను ఎదుర్కొనే దమ్ముందా? అంటూ పరిహసిస్తోంది. కరోనా కాలంలో మనుషులంతా ఇళ్లకు పరిమితంకాగా అడవుల్లోని జంతువులన్నీ నగరాలు, పట్టణాల్లో తిరుగుతున్నాయి. కరోనా వైరస్ జంతువులపై కాకుండా మానవులపై తన ప్రతాపాన్ని చూపిస్తూ ఇప్పటికైనా మనుషులు మారాలనే సందేశాన్ని ఇచ్చింది. అయినప్పటికీ ఇంకా కొంతమందిలో మార్పురాకపోవడం శోచనీయంగా మారింది.

Also Read: చైనాకు దెబ్బ.. భారతీయుల ప్రతాపం

ఇక కరోనా వైరస్ కారణంగా మనుషులంతా పిట్టల్లా రాలుతుండటంతో ప్రతీఒక్కరిలో భయాందోళన మొదలైంది. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడాలేకుండా కరోనా మహమ్మరి ప్రతీఒక్కరిపై తన ప్రభావం చూపుతోంది. దీంతో ప్రపంచంలోని చాలాదేశాలు లాక్డౌన్ విధించి కరోనాను కొంతమేర కట్టడి చేయగలిగాయి. అయితే కరోనాను పూర్తిస్థాయిలో నివారించాలంటే మాత్రం వాక్సిన్ తయారీ తప్పనిసరైంది. దీంతో సైంటిస్టులు రేయింబవళ్లు కష్టించి వ్యాక్సిన్ తయారీ కోసం పాటుపడుతున్నారు. ఇప్పటికే పలుదేశాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్ జోరుగా కొనసాగుతోన్నాయి.

కరోనా కారణంగా అమెరికా దేశం ఎక్కువగా నష్టపోతుంది. కరోనా కేసులు ప్రపంచంలోనే అమెరికాలో ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశ వ్యాక్సిన్ కోసం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన మోడెర్నా ఫార్మా కంపెనీ వ్యాక్సిన్ ట్రయల్స్ చివరిదశకు చేరుకున్నాయని అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. సోమ‌వారం నుంచి చివరి దశ ట్రయల్స్ లో భాగంగా 30వేల మందిపై ప్ర‌యోగాలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. వీరిలో స‌గం మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చి.. మిగిలిన స‌గం మందికి ప్లేసిబో (డ‌మ్మీ వ్యాక్సిన్‌) ఇస్తారు. దీని ద్వారా వ్యాక్సిన్ ప‌నిత‌నాన్ని ప‌రీక్షించి రోగులకు అందుబాటులోకి తీసుకొస్తారు.

Also Read: ఆ రాష్ట్రానికి కరోనా తలవంచనుందా?

అమెరికా ప్రభుత్వం ఇప్పటికే మోడెర్నా సంస్థకు ఒక బిలియన్ డాలర్ల ఆర్థికసాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ఓవైపు కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ చేపడుతూనే మరోవైపు అమెరికా కోసం 500మిలియ‌న్ల డోసుల‌ వ్యాక్సిన్ సిద్ధం చేసేందుకు సన్నహాలు చేస్తోంది. 2021ఆరంభం వ‌ర‌కు 1బిలియ‌న్ డోసుల‌ను ఉత్ప‌త్తి చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మోడెర్నా ఫార్మాతోపాటు ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఆస్ట్రాజెనికాలు త‌యారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు కూడా చివ‌రి ద‌శ ట్ర‌య‌ల్స్‌కు చేరుకున్నాయి. దీంతో వ్యాక్సిన్ పై ఆశలు రోజురోజుకు పెరుుతున్నాయి.

ఆగ‌స్టు నాటికి ఏదోఒక కంపెనీ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో కరోనాపై తొలి వ్యాక్సిన్ ఏ కంపెనీ, ఏదేశం తీసుకొస్తుందా? అనే ఆసక్తి నెలకొంది.

Tags
Show More
Back to top button
Close
Close