జాతీయంరాజకీయాలు

టీకాలే లేని టీకా ఉత్సవ్‌

Tika Utsav
దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు అన్నీఇన్నీ కావు. అంతేకాదు.., కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా నడుస్తోంది. ప్రస్తుతం దేశంలో 45 సంవత్సరాలు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్‌ వేస్తున్నారు. అయినా కరోనా కంట్రోల్‌ కావడం లేదు. ఓ వైపు వ్యాక్సినేషన్‌ నడిపిస్తున్నా.. మరోవైపు కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తూనే ఉంది.

అయితే.. కరోనా వ్యాక్సిన్‌ వేయడంలో చూపించిన శ్రద్ధ.. ఏర్పాట్లలో చూపించలేకపోయారనే విమర్శ ఉంది. ఫలితంగా ప్రజలు కష్టపడాల్సి వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ 14 తేదీ నుంచి టీకా ఉత్సవ్ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ.. అందుకు తగినట్లుగా టీకాలు ఉన్నాయో లేదో తెలియకుండా ఉంది. అసలు రాష్ట్రాలకు ఎంత డిమాండ్‌ ఉంది..? ప్రస్తుతం ఎన్ని డోస్‌లు అందుబాటులో ఉన్నాయి..? ఏ రాష్ట్రానికి ఎన్ని డోసులు కావాలి..? రాష్ట్రాల నుంచి కూడా డేటా పంపించలేకపోయారు.

కానీ.. ప్రధాని మోడీ మాత్రం వీటిని పట్టించుకోకుండా ఈ టీకా ఉత్సవం నిర్వహిస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రాల నుంచి టీకాలు పంపాలని ఆయనకు రివర్స్‌లో లెటర్లు వెళ్తున్నాయి. మొత్తం కోటి మందికి టీకాలు వేయాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి డిసైడ్‌ అయ్యారు. దీనిపై కేంద్రానికి కూడా లేఖ రాశారు. అర్జంటుగా రాష్ట్రానికి పాతిక లక్షల డోస్‌లు పంపించాలని కోరారు.టీకా ఉత్సవం నిర్వహించడానికి రెడీగానే ఉన్నామని.. కానీ అందుకు సరిపడా డోస్‌లు అందుబాటులో లేవని అందులో పేర్కొన్నారు.

ఒక్క జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే కాదు.. మహారాష్ట్ర సీఎం, రాజస్థాన్‌ సీఎం.. ఇలా దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి లేఖలు వెళ్తున్నాయట. టీకా డోసులు పంపించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు.. ప్రతిపక్షల నుంచి మోడీకి ప్రశ్నలతో అటాక్‌ చేస్తున్నారు. ఓ పక్క స్వదేశంలోనే టీకాలు వేద్దామంటే డోసులు లేని పరిస్థితి ఉంటే.. విదేశాలకు ఎందుకు ఎగుమతి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కానీ.. దీని వద్ద కేంద్రం నుంచి సమాధానం లేనే లేదు.

ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటి కోవిషీల్డ కాగా.. మరొకటి కోవాగ్జిన్‌. ఈ రెండింటి ఉత్పత్తి అయితే చాలా పరిమితం. ఈ రెండు వ్యాక్సిన్లే ఇప్పుడు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే.. దేశంలో కరోనా డోస్‌లు అందుబాటులో ఉన్నాయో లేవో తెలియకుండానే.. తెలుసుకోకుండానే ప్రధాని మోడీ టీకా ఫెస్టివల్‌ను ప్రకటించేశారు. ప్రధాని మోడీ లక్ష్యం ఏమేరకు నెరవేరుతుందో చూడాలి మరి.

Back to top button