వ్యాపారము

మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ట్యాక్స్ కట్టక్కర్లేదట..!


కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాక్సేషన్ చట్టాల సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ లోక్ సభలో ప్రవేశపెట్టింది. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌ ను తొలగించాలనే భావనతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. 2012 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌ ను అమలులోకి తీసుకొచ్చింది.

కెయిర్న్ ఎనర్జీ, వొడాఫోన్ గ్రూప్ తో పాటు ఇతర కంపెనీలపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ను విధించాలనే ఉద్దేశంతో రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌ ను తీసుకురాగా ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్స్‌ ను ఆశ్రయించి కెయిర్న్ ఎనర్జీ, వొడాఫోన్ గ్రూప్ కంపెనీలు గెలిచాయి. కేంద్ర ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌ ను తొలగించాలని అనుకుంటే ఆదాయపు పన్ను చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వం ట్యాక్స్ ను తొలగిస్తే కెయిర్న్ ఎనర్జీ, వొడాఫోన్ గ్రూప్ తో పాటు ఇతర సంస్థలు చెల్లించిన డబ్బులను వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. కెయిర్న్ ఎనర్జీ సంస్థను 8,800 కోట్ల రూపాయలు, వొడాఫోన్ గ్రూప్ నుంచి 22,000 కోట్ల రూపాయలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్స్‌ ను ఆశ్రయించడం వల్ల భారత్ కు ఎదురుదెబ్బలు తగిలాయి.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల కంపెనీలు హర్షం వ్యక్తం చేసుకుంటుండటం గమనార్హం. రెట్రో ట్యాక్స్ విషయంలో కేంద్రం తీసుకున్న తీసుకున్న నిర్ణయం ద్వారా కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుంది.

Back to top button