వ్యాపారము

వాహనదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిబంధనలు..?

Central Govt: New Vehicle Registration Rules

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. కేంద్రం తెచ్చే ఈ నిబంధనల వల్ల వాహనదారులకు ఎంతో మేలు చేకూరనుందని తెలుస్తోంది. ఇప్పటికే రోడ్డు రవాణా శాఖ డ్రాఫ్ట్ రూల్స్‌ను సిద్ధం చేయగా ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు, ఉద్యోగం లేదా ఉపాధి కోసం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే వారికి, డిఫెన్స్ అధికారులకు ప్రయోజనం చేకూరనుంది.

కేంద్ర ప్రభుత్వం వెహికిల్ రిజిస్ట్రేషన్ కు కొత్త వ్యవస్థను అమలులోకి తీసుకురానుండగా వాహనదారులకు ఇందులో in సిరీస్ ను కేటాయించడం జరుగుతుంది. పైలెట్ ప్రాజెక్ట్‌ కింద ఈ కొత్త సిస్టమ్ అమలులోకి రానుండగా ఉద్యోగులు పని చేసే కంపెనీకి ఐదు లేదా అంత కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీ ఆఫీస్‌లు కలిగి ఉంటే కేంద్రం వారికి మాత్రం in సిరీస్ ను కేటాయించనుందని తెలుస్తోంది.

ప్రైవేట్ రంగ ఉద్యోగులు, డిఫెన్స్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ఉద్యోగులు, పీఎస్‌యూ ఉద్యోగులు కూడా ఈ ఫెసిలిటీని వినియోగించుకోవచ్చు. ఈ కొత్త వ్యవస్థ ద్వారా వాహనదారులకు అంతరాష్ట్ర ప్రయాణం సులభతరం కానుందని సమాచారం. ఈ విధానం వల్ల వాహనదారులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయిన సమయంలో వెహికల్ వెంట తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

ఇతర రాష్ట్రాల్లో వాహనాన్ని నడిపినా వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావు. త్వరలోనే కొత్త వెహికల్ రీరిజిస్ట్రేషన్ రూల్స్ అమలులోకి రానున్నాయని సమాచారం. కేంద్రం నిర్ణయం వల్ల వాహనదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది.

Back to top button