జాతీయంరాజకీయాలు

టీకా ఉత్సవ్.. కరోనాపై మలియుద్ధం

Vaccine Utsav
దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజులకు అంచనాలకు మించిన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వైరస్ విస్తరణ వేగం పెరిగిపోయింది. క్షణాల్లో తన అవతారాన్ని మార్చుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా కట్టడికి మలిదశ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే దేశ ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు చేశారు. ఇందులో భాగంగా కేంద్ర తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. ఈనేపథ్యంలో ఆదివారం దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. టీకా ఉత్సవ్ ను కరోనాపై చేయబోతున్న రెండో యుద్ధానికి నాందిగా అభివర్ణించారు. ఏప్రిల్ 11 జ్యోతిబాపూలే జయంతి రోజు ప్రారంభం అయిన కార్యక్రమాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మదినం అయిన ఏప్రిల్ 14న ముగియనున్నట్లు రెండు తేదీలకు ఉన్న విషిష్టతను ఈ సందర్భంగా వివరించారు. ఇకపై వ్యక్తిగత శుభ్రతతో పాటు.. సామాజిక పరిశుభ్రతపై కూడా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా పలు విషయాలు వెల్లడించారు.

ప్రతీఒక్కరు టీకా వేయించుకోవాలన్న మోదీ.. చదువుకోని వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అక్షరాస్యులదని అన్నారు. ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరికి మరొకరు కరోనా చికిత్స అందించాలని.. వారికి అండగా నిలవాలని సూచించారు. ప్రతీ ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలని సూచించారు. తద్వారా మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు.. ఇతరులను కూడా రక్షించే అవకాశం ఉందని తెలిపారు. ఎవరైనా కరోనా బారిన పడితే.. చుట్టూ మైక్రో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సూచించారు.

మైక్రో కంటైన్మెంట్ జోన్ల అవసరం లేకుంటే.. ఇంటినుంచి బయటకు వెళ్లకుండా ఉండాలన్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. మాస్క్ ధరించడంతో పాటు ఇతర నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. అప్పుడే కరోనాపై మన విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు. దేశంలో అర్హులైన వారికి వీలైనంత త్వరగా టీకా వేయాలని టీకా ఉత్సవ్ ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని కరోనాపై మలిదశ యుద్ధంలో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.

Back to top button