ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్మిర్చి మసాలా

23న జగన్‌తో ప్రధాని మోదీ వీడియోకాన్పరెన్స్‌..

కరోనా నివారణఫై చర్చ

shock to Modi for the first time

దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకు విస్తరిస్తోంది. మరోవైపు కోలుకుంటున్నవారి సంఖ్యా పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాలో మాత్రం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. దాదాపు 60 శాతం కేసులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లో నమోదవుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో ఈనెల 23న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై కరోనా వ్యాధిపై చర్చించనున్నారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో 10వేలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి జగన్‌తో మోదీ సమావేశం కానుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Back to top button