జాతీయంరాజకీయాలు

వ్యవసాయ బిల్లులపై మళ్లీ మోడీ అదే కథ?

వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలుపడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగం చరిత్రలో ఇవాళ అద్భుతమైన రోజు అని పేర్కొన్నారు

MOTN Survey

అటు లైవ్ లో విలేకరులను.. ఇటు పార్లమెంట్ లో లైవ్ లో విపక్షాలను ఎదుర్కోవడానికి భయపడే ప్రధాని మోడీ కీలకమైన వ్యవసాయ బిల్లుల వేళ పార్లమెంట్ లో స్పందించలేదు. అయితే తరువాత ట్విట్టర్ లో మాత్రం ఎవరి భయం ఉండదు కాబట్టి మోడీ స్వేచ్ఛగా స్పందిస్తుంటారని ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ అప్పట్లో దెప్పిపొడిచారు. అన్నట్టుగానే ఇంతటి వివాదాస్పద బిల్లులపై పార్లమెంట్ లో స్పందించకుండా మోడీ ట్విట్టర్ లోనే స్పందించడం విశేషం.

Also Read: విపక్షాల సంచలనం.. డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాసం

వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలుపడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగం చరిత్రలో ఇవాళ అద్భుతమైన రోజు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ‘దశాబ్ధాలుగా రైతులు దళారుల బెదిరింపులకు గురయ్యారు. పార్లమెంట్ ఆమోదించిన ఈ బిల్లులతో రైతుల కష్టాలకు విముక్తి ఏర్పడింది. ఈ బిల్లులు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయి. వ్యవసాయంలో టెక్నాలజీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. కోట్ల మంది రైతులకు ధన్యవాదాలు’ అని అన్నారు.

వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలుపడంపై విపక్షాలు సభలో పెద్ద యుద్ధమే చేశాయి. రచ్చ రచ్చ జరిగింది. మరోవైపు విపక్షాలన్నీ కలిసి కొద్దిసేపటి క్రితమే ఓటింగ్ నిర్వహించకుండా అప్రజాస్వామికంగా మూజువాణి ఓటుతో ఆమోదించారని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. ఇదంతా ఓవైపు జరుగుతున్న వేళ ఈ వివాదంపై ప్రధాని మోడీ ట్విట్టర్ లో స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: రాజ్యసభలో రణరంగం.. వ్యవసాయ బిల్లులకు ఆమోదం

ఈ బిల్లుకు బీజేపీకి మద్దతుగా ఏపీలోని వైసీపీ, జేడీయూ మాత్రమే మద్దతు తెలిపాయి. మెజార్టీ దేశంలోని పార్టీలన్నీ వ్యతిరేకించాయి.

Back to top button