జాతీయంమిర్చి మసాలారాజకీయాలు

రైతులకు మోదీ శుభవార్త.. మరో 5 వేలు రైతుల ఖాతాల్లో జమ..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు శుభవార్త చెప్పారు. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న మోదీ సర్కార్ రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తోంది. రోజురోజుకు విత్తనాల ఖర్చులు, పురుగుమందుల ఖర్చులు, కూలీల ఖర్చులు, ఎరువుల ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో రైతుల ఆదాయం పెంచే దిశగా మోదీ అడుగులు వేస్తున్నారు.

Also Read : తండ్రిని చంపిన వ్యక్తి కోసం 17 ఏళ్లుగా వెతుకుతున్న కొడుకు.. చివరకు..?

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ స్కీమ్ లో భాగంగా మూడు విడతల్లో 6 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరు వేలకు అదనంగా మరో 5 వేల రూపాయలు జమ చేసే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) నుంచి ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. ప్రస్తుతం సీఏసీపీ చేసిన సూచనలను కేంద్రం పరిశీలిస్తోంది.

సీఏపీసీ రైతులకు ఎరువులు, పురుగుమందుల సబ్సిడీ కింద ఐదు వేల రూపాయలు ఇవ్వాలని సూచనలు చేసింది. ఖరీఫ్ సీజన్ లో ఒకసారి, రబీ సీజన్ లో ఒకసారి 2,500 రూపాయల చొప్పున ఈ మొత్తాన్ని జమ చేస్తే బాగుంటుందని పేర్కొంది. అయితే కేంద్రం ఫర్టిలైజర్ సబ్సిడీ అందిస్తే ఎరువులు, పురుగు మందుల రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం రైతులకు సబ్సిడీ ఇస్తే ఫర్టిలైజర్ కంపెనీలకు సబ్సిడీ ఇవ్వదు.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వల్లే ఇప్పటివరకు ఫర్టిలైజర్ కంపెనీలలో మనకు తక్కువ ధరకే ఎరువులు లభిస్తున్నాయి. సీఏపీసీ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదిస్తే మాత్రం వచ్చే ఏడాది నుంచి రైతుల ఖాతాలో 11,000 రూపాయలు జమవుతాయి.

Also Read : తల్లిదండ్రులను బిచ్చగాళ్లను చేసిన కొడుకు… మనిషేనా అంటున్న నెటిజన్లు..?

Back to top button