టాలీవుడ్సినిమా

అభిమానులకు మోహన్ లాల్ సర్ ప్రైజ్ గిప్ట్

నేడు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ 60వ జన్మదినం. కేరళలో ఆయన పుట్టిన రోజును అభిమానులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. గతంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం మూవీకి సిక్వెల్ గా ‘దృశ్యం-2’ రాబోతుందని తన ట్వీటర్లో ట్వీట్ చేశారు. మోహన్ లాల్, మీనా జోడీగా నటించిన ‘దృశ్యం’ మలయాళంలో సూపర్ హిట్టుగా నిలిచింది. దర్శకుడు జీతూ జోసఫ్ దృశ్యం మూవీని తెరకెక్కించాడు. 2013లో ఈ మూవీ రిలీజై 50కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహాళం(శ్రీలంక), చైనీష్ భాషల్లోకి రీమేక్ చేయబడింది. చైనీష్ భాషలోకి రీమేకైనా తొలి చిత్రం దృశ్యం మూవీ రికార్డు సృష్టించింది.

దృశ్యం మూవీ తెలుగులోనూ భారీ విజయం సాధించింది. సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా తెరెకెక్కిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్, మీనా హీరోహీరోయిన్లు నటించారు. దృశ్యం-2కు సంబంధించి 20సెకన్ల టీజర్ ను మోహన్ లాల్ ట్వీటర్లో విడుదల చేశారు. జార్జ్ కుట్టీ క్యారెక్టర్లో మోహన్‌లాల్ స్లోగా కళ్లు తెరుస్తాడు. #Drishyam #Drishyam 2(sic) అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో టీజర్ రిలీజ్ చేశారు. ఆంటోనీ పెరుంబవూర్ దీనికి నిర్మాణ బాధ్యతలు వహించనున్నారు. షూటింగులకు కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే దృశ్యం-2 ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. త్వరలోనే నటీనటులను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. మోహన్ లాల్ పుట్టిన రోజు సందర్భంగా విక్టరీ వెంకటేష్ ఆయనకు బర్తేడే శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి అత్యుత్తమ ప్రదర్శనలతో మమ్మల్ని అలరించండి సార్ అంటూ ట్వీట్ చేశాడు.