సినిమా వార్తలు

అఖిల్ తో మోనాల్ కొత్త లవ్ స్టోరీ !

Biggboss Fame
‘బిగ్‌ బాస్’ షోకి వెళ్లి మంచి పాపులారిటీ తెచ్చుకుంది ‘మోనాల్’. బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తోంది. మొదటి నుండి మోనాల్ ఆఫర్ల విషయంలో చాల తెలివిగా ముందుకు పోతుంది. ఆల్రెడీ తనకు హీరోయిన్ ఇమేజ్ ఉన్నా.. డబ్బులు ఇస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తానంటూ ముందుకుపోతుంది. ఇప్పటికే ఐటెమ్ సాంగుల నుంచి, టీవీ షోల వరకూ ఏది వదిలిపెట్టకుండా వచ్చిన క్రేజ్ ను ఫుల్ గా క్యాష్ చేసుకునే క్రమంలో ఆమె తాజాగా ఒక వెబ్ సిరీస్ ను కూడా ఒప్పుకుంది.

ఇంతకీ ఆ వెబ్ సిరీస్ ఏమిటంటే.. బిగ్‌బాస్‌ ఫేం అఖిల్ హీరోగా ఒక వెబ్ సిరీస్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఐతే, అతని వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా మోనాల్ నటిస్తోంది. తెలుగు అబ్బాయి – గుజరాతీ అమ్మాయి మధ్య లవ్ అనే కొత్త కాన్సెప్ట్ తో రూపొందనుంది ఈ వెబ్ సిరీస్. ఈ సిరీస్ లో అఖిల్, మోనాల్ జంటగా నటిస్తున్నారుట. మోనాల్ ఇప్పటికే ఐటెం సాంగ్స్, స్పెషల్ రోల్స్ తో బిజీగా మారింది.‌ ఇప్పుడు వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మొత్తానికి అమ్మడు ఎక్కడా గ్యాప్ లేకుండా వరుసపెట్టి.. వచ్చిన ఛాన్స్ లను ఒప్పుకుంటూ డబ్బులు చేసుకుంటుంది. అన్నట్టు బిగ్ బాస్ లో మోనాల్ అటు అభిజిత్ తోనూ, ఇటు అఖిల్ తోనూ క్లోజ్ గా మూవ్ అయి.. మంచి లవ్ స్టోరీలు కూడా నడిపిన బాగోతం తెలిసిందే. అయితే, బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత అభిజిత్ ఇప్పటివరకు హీరోగా సినిమా ప్రకటించకలేకపోయాడు. కానీ అఖిల్ మాత్రం సినిమా, ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Back to top button