టాలీవుడ్సినిమా

స్టార్ల మధ్య పోటీలో బ్యాచలర్ నిలబడగలడా ?

Most Eligible Bachelor
అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ప్రసుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో.. ఇక బ్యాచలర్ ను సమ్మర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్యాచలర్ కు స్ట్రైట్ రిలీజ్ డేట్ దొరికే అవకాశం మాత్రం కనిపించడం లేదు. సమ్మర్ లో ఏకంగా పది సినిమాల వరకూ విడుదలవ్వనున్నాయి. ఆ సినిమాల పోటీలోనే బ్యాచలర్ రావాలి.

Also Read: ‘ఎన్టీఆర్, పవన్, చరణ్’ రికార్డ్స్ పై బన్నీ కామెంట్స్ !

ముఖ్యంగా మార్చి 26న నితిన్ రంగ్ దేను, ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో వకీల్ సాబ్ ను, మే మొదటి వారంలో ‘ఆచార్య’, టక్ జగదీష్ ఏప్రిల్ 16న ఇలా మొత్తానికి మంచి అంచనాలు ఉన్న స్టార్స్ సినిమాలతో బ్యాచలర్ కు పోటీ అంటే.. మరి బ్యాచలర్ నిలబడగలడా ? డౌటే. ఇక ఈ సినిమా అవుట్ ఫుట్ పట్ల నాగ్ అసంతృప్తిగా ఫీల్ అయినట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

Also Read: హర్ష కాబోయే భార్య ఎవరో తెలుసా? నాలుగేళ్లు డేటింగ్ అట !

మరి ఆ వార్తలు నిజం అయితే, బహుశా అఖిల్ హిట్ రావడం ఇక కష్టమే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే, అఖిల్ – పూజా హెగ్డేల మధ్య కొన్ని లవ్ సీన్స్ చాల బాగా వచ్చాయని.. ఈ సీన్స్ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తాయని.. ఓవరాల్ గా లవ్ స్టోరీ కూడా సినిమాలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. కాగా అఖిల్ గత సినిమా ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. దాంతో ఈ సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button