ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

ఎంపీ కేశినేని నాని గారు… మీకిది తగునా?


దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ విషయంలో ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ ఫ్లై ఓవర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2015 డిసెంబరులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మూడు నెలల వ్యవధిలో నిర్మాణంపూర్తి చేసి పుష్కరాల సమయానికి ఫ్లై ఓవర్ ను అందుబాటులోకి తీసుకువస్తామని చంద్రబాబు చెప్పారు. రివ్యూ సమావేశం జరిగినప్పుడల్లా గడువు మూడు, ఆరు నెలలు పెంచుకుంటూ పోయారు. చివరికి అది ఐదేళ్లకు గాని పూర్తి కాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికైనా నిర్మాణం పూర్తవడం సంతోషించదగిన విషయమే.

Also Read: స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం వెనకున్న అసలు కుట్ర బయటపడింది…!

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం వివాదానికి తావిస్తోంది. ఒక పక్క ప్లై ఓవర్ ప్రారంభానికి పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. ప్రభుత్వం ప్రారంభోత్సవం తేదీ ఖరారు చేయలేదు. ఎంపీ మాత్రం  ముందే వెళ్లి కేంద్ర మంత్రిని ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందకపోతే కేంద్ర మంత్రి నాని ఆహ్వానాన్ని పరిగణలోకి తీసుకుని ప్రారంభోత్సవానికి హాజరవుతారా? అది సాధ్యం కాదని నానికి తెలుసు. ఈ వ్యవహారం వెనుక తనకు ఆహ్వానం అందుతుందో లేదో అనే సందేహాంతోనే ఎంపీ నాని ఇలా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఫ్లై ఓవర్ నిర్మాణం ఘనత గడ్కరీ, చంద్రబాబు దక్కుతుందని ఎంపీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Also Read: ‘స్వర్ణా’ వ్యవహారంలో రామ్ కు చిక్కులు తప్పవా?

గత ఐదేళ్ల కిందట ఇదే ఆలోచన టిడిపి నాయకులకు ఉండకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులకు వరుసపెట్టి ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూ రోజుకో జిల్లాలో పర్యటించారు. అంతెందుకు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా చంద్రబాబు దానిని ప్రారంభించడం అప్పట్లోనే విమర్శలు వినిపించాయి. నాని చెప్పిన లెక్క ప్రకారం కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇన్నర్ రింగ్ రోడ్డు ఘనత వారికే దక్కాల్సి ఉండగా… కొత్తగా రంగులేసి తన ఘనతే అని చంద్రబాబు చెప్పుకుంటే ఎంపీ నాని ఆయన పక్కనే ఉండి ఎందుకు మాట్లాడలేకపోయారనే విషయం ఇప్పడు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలను వేదిస్తోంది.

Back to top button