క్రీడలు

MS Dhoni: ఎంఎస్ ధోనిని టీమిండియా మెంటర్ గా అందుకే ఎంపిక చేశారా?

దాదాపు 8 ఏళ్లుగా ప్రపంచకప్ గెలవని భారత్ కల తీర్చేందుకు ఎటువంటి నిర్ణయమైన తీసుకుంటామని.. ఈసారి టీ20 ప్రపంచకప్ కు పక్కా ప్రణాళికతో భారత్ సిద్ధమైందని గంగూలీ తెలిపాడు. ఈ క్రమంలోనే టీంకు ధోని సేవలు అవసరం అనే అతడిని మెంటర్ గా తీసుకున్నామని గంగూలీ తెలిపాడు.

MS Dhoni: ప్రపంచకప్ టీ20 జట్టుకు మాజీ కెప్టెన్, క్రికెట్ మేధావి ఎంఎస్ ధోని(MS Dhoni)ని ఎంపిక చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మాజీ సీనియర్ క్రికెటర్లు మాత్రం తప్పు పడుతున్నారు. కెప్టెన్ కోహ్లీ(Virat kohli), కోచ్ రవిశాస్త్రి లాంటి వారిని అవమానించడమేనని అంటున్నారు. ఇదో వివాదం కావడంతో తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sowrav Ganguly) స్పందించారు.

ఎంఎస్ ధోనిని ఎందుకు టీమిండియా టీ20 ప్రపంచకప్ టీంకు మెంటర్(Menter) గా చేశామనే దానికి గంగూలీ వివరణ ఇచ్చాడు. ‘2013లో ఐసీసీ ట్రోఫీ ధోని సారథ్యంలో గెలిచాక ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా భారత్ గెలవలేదు. ద్వైపాక్షిక సిరీస్ లలో గెలుస్తున్నా కూడా ఐసీసీ ఈవెంట్లలో మాత్రం తేలిపోతోంది. 2017లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చేతిలో ఘోరంగా ఓడింది. 2019 వన్డే ప్రపంచకప్ లోనూ సెమీఫైనల్ లోనే ఇంటిదారి పట్టింది. ఇక ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లోనూ న్యూజిలాండ్ చేతిలో కోహ్లీ సేన ఓడిపోయింది. ఇక వరల్డ్ టీ20ల్లో వరుసగా రెండు సార్లు ఓడిపోయింది.

అందుకే మూడు ప్రపంచకప్ లు గెలిచిన ఎంఎస్ ధోని లాంటి క్రికెట్ మేధావి సేవలు జట్టుకు అవసరం అని.. అందుకే అతడి గురించి బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు.

2019లో బలంగా ఉన్న ఇంగ్లండ్ ను ఎదుర్కొనేందుకు యాషెస్ సిరీస్ లో విజయవంతమైన కెప్టెన్ స్టీవ్ వా సేవలను ఆస్ట్రేలియా ఉపయోగించుకుందని.. వారు ఇంగ్లండ్ తో సిరీస్ డ్రా చేసుకోవడంలో స్టీవ్ వా పాత్ర కీలకమని గంగూలీ తెలిపాడు.

దాదాపు 8 ఏళ్లుగా ప్రపంచకప్ గెలవని భారత్ కల తీర్చేందుకు ఎటువంటి నిర్ణయమైన తీసుకుంటామని.. ఈసారి టీ20 ప్రపంచకప్ కు పక్కా ప్రణాళికతో భారత్ సిద్ధమైందని గంగూలీ తెలిపాడు. ఈ క్రమంలోనే టీంకు ధోని సేవలు అవసరం అనే అతడిని మెంటర్ గా తీసుకున్నామని గంగూలీ తెలిపాడు.

మరి బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఫలిస్తుందా? ధోని టీమిండియా చిరకాల కోరిక తీరుస్తాడా? ప్రపంచ టీ20 కప్ ను సాధించిపెడుతాడా? అన్నది వేచిచూడాలి.

Back to top button