రాజకీయాలువైరల్

ధోని సరికొత్త లుక్.. వీడియో వైరల్..


భారత క్రికెట్ టీం మాజీ కెప్టెన్, వికట్ కీపర్ ధోని అభిమానులకు సరికొత్త లుక్కులో దర్శనిమిచ్చాడు. లాక్డౌన్ కారణంగా ఫామ్ హౌజ్ కే పరిమితమైన ధోని ఫ్యామిలీతో కాలక్షేపం చేస్తున్నాడు. తాజాగా ఫామ్ హౌజ్ లో తన కూతురు జీవాతో సరదాగా పరిగెడుతూ, ఆడుతూ కన్పించాడు. మసిన గడ్డం, రఫ్ లుక్కులో కన్పించాడు. తన కూతురితో కలిసి బంతాట ఆడుతున్న వీడియోను ధోని తాజాగా పోస్టు చేశారు. ఈ వీడియో తన కూతురు జీవా ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేయగా వైరల్ గా మారింది.

మందు ఓపెన్.. గుడులు, పనులు బంద్ న్యాయమా?

ఇండియన్ క్రికెటర్ ధోని ఇప్పటికే ఎన్నోరకాల హెయిర్ స్టైల్లో కన్పించాడు. ఒక్కోసారి గుండుతో దర్శనిమిచ్చి సంఘటనలు ఉన్నాయి. అయితే పూర్తిగా మసిన గడ్డంతో కన్పించడం ఇదే తొలిసారి. లాక్డౌన్ కారణంగా ధోని ఇలా గడ్డం పెంచినట్లు అన్పిస్తోంది. అయితే దేశంలో లాక్డౌన్ మే 17వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ధోని అప్పటివరకు ఇలా మసిన గడ్డంలోనే కన్పించేలా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ వీడియో చూసిన వారంతా రెగ్యూలర్ ధోనిలా కాకుండా కొత్తగా కన్పిస్తున్నాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం ధోని కొన్ని నెలలుగా టీంఇండియాకు దూరంగా ఉంటున్నాడు. అయితే 2020 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాలని భావిస్తున్నాడు. లాక్డౌన్ ముగిశాక ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో అప్పటికి ధోని మరో సరికొత్త గెటప్ లో కన్పించడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఈమేరకు ఐపీఎల్లో ధోని ఏ గెటప్ లో కన్పిస్తాడో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.