సినిమా వార్తలు

‘పూరి’ కోసమే ఒప్పుకుందట.. దుమారం రేపేలా చేసిందట !

Liger Movie
క్యూట్ బ్యూటీగా మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ తెచ్చుకుంది కన్నడ భామ ‘నభ నటేష్’. నిజానికి నభా నటించిన ఆమె తోలి సినిమా ‘నన్ను దోచుకుందువటే’లో ఆమె లుక్స్ ను చూసిన పూరి, తన ఇస్మార్ట్ శంకర్ లో ఏరి కోరి నభాని పెట్టుకున్నాడు. పూరి పిలిచి ఛాన్స్ ఇవ్వడంతో ఈ టాలెంటెడ్ గర్ల్ కూడా తనలోని గ్లామర్ యాంగిల్ ని మొత్తం ఆ సినిమాలో విచ్చలవిడిగా ప్రదర్శించింది. దాంతో నభ నటేష్ కు తెలుగులో పలు అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. అయితే, ఆ తరువాత ఏమైందో ఏమో గాని అమ్మడికి ఛాన్స్ లు రావడం లేదు. వచ్చిన ఛాన్స్ లు కూడా చేజారిపోతున్నాయి.

అన్నిటికి మించి సెకెండ్ హీరోయిన్ గానే నభాని అడుగుతున్నారు తప్ప, ఆమెకు మెయిన్ రోల్స్ ఆఫర్ చేయడం లేదు. అందుకే ప్రస్తుతం ఈ అమ్మడు పూరి జగన్నాద్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో నటిస్తుంది. తాజాగా ఈ హాట్ ఐటెం సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఐటెం గర్ల్ గా ఈ అమ్మడు రెచ్చిపోయి మరీ చిందేస్తుందట. ఈ మధ్య హీరోయిన్స్ కేవలం హీరోయిన్ పాత్రల్లోనే కాకుండా ఐటమ్ భామగా నటించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికి స్టార్ హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ తో క్రేజ్ తెచ్చుకునేందుకు కిందామీదా పడుతున్నారు.

ఇప్పుడు ఆ కోవలోకి నభా కూడా చేరింది. అన్నట్టు హీరోయిన్ గా ప్రస్తుతం అవకాశాలు తగ్గుతున్నాయి కాబట్టి.. తానూ స్పెషల్ సాంగ్ కి ఒప్పుకోలేదు అని, కేవలం పూరి మీద ఉన్న గౌరవం వల్లే ఐటమ్ సాంగ్ లో నటించాను అని చెబుతుంది ఈ బ్యూటీ. ఇక ఈ అమ్మడు చేసిన సాంగ్ ఓ రేంజ్ లో ఉంటుందట. హాట్ ఐటెం గర్ల్ గా నభ నటేష్ దుమారం రేపడం ఖాయమని సాంగ్ చేసిన చిత్రబృందం అంటుంది. తెలుగు కన్నడ సినిమాల్లో నటించిన ఈ అమ్మడి ఫోకస్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ పై పడింది.

Back to top button