టాలీవుడ్సినిమా

సింగర్ సునీతకి అండగా నిలబడిన మెగా బ్రదర్

Nagababu sunitha marriage
టాలీవుడ్ సింగర్ సునీత రెండో పెళ్లి వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో ఈనెల 9న శంషాబాద్ లోని సీతారాముల గుడిలో హిందూ సంప్రదాయ ప్రకారం వీరి వివాహం అతికొద్ది మంది బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. గతంలో కిరణ్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సింగర్ సునీత ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో డైవర్స్ తీసుకుని తన తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ వివాహముతో ఆమె నూతన బంధంలోకి అడుగు పెట్టారు.

Also Read: స్వీటీ అనుష్క ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు !

ఈ నేపథ్యంలో సునీత పెళ్లిపై సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలను వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సునీత,రామ్ దంపతులను అభినందిస్తుంటే… మరికొందరు రెండో పెళ్లి విషయం మీద సునీతను విమర్శిస్తున్నారు. సునీత పెళ్లి ఫోటోలపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు గారు సునీతకి సపోర్ట్ గా నిలబడి ఆమె మీద చేస్తున్న విమర్శలకి సోషల్ మీడియా ద్వారా గట్టిగా సమాధానం ఇవ్వటం జరిగింది.

Also Read: అప్పటి ముచ్చట్లు: ‘అరె కుర్రాడు బాగున్నాడే’.. పెళ్లిసందడికి 25 ఏళ్లు !

నాగబాబు తన ట్విట్టర్ ఖాతాలో… సంతోషం అనేది పుట్టుకతో ఉండదు, దాన్ని మనమే వెతుక్కోవాలన్నారు. రామ్ – సునీతలు ఇద్దరూ కూడా తమ సంతోషాలను కనుగొన్నందుకు శుభాకాంక్షలు తెలియజేసారు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కొందరు వెనుకడుగు వేస్తారు. కొందరు అవకాశాలని అందుకోటానికి సంకోచిస్తారని వారికి ఈ జంట చక్కని ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ”ప్రేమ సంతోషం అనేది ఎప్పటికీ మీ శాశ్వత చిరునామాగా ఉండాలని కోరుకుంటున్నానని… మీ ఇద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ ఆయన ట్విట్ చేసి ఈ నవ దంపతులకి అండగా నిలిచి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button