తెలంగాణప్రత్యేకంరాజకీయాలుసినిమా

నిర్మాత సురేష్ బాబునే మోసం చేశారు

Nagarjuna Reddy cheated on producer Suresh Babu

దొంగలు తెలివి మీరిపోయారు. ఏకంగా పెద్ద పెద్ద వ్యక్తులు, ప్రముఖులకే టోకరా వేస్తున్న పరిస్థితి ఉంది. కరోనా భయాలను సొమ్ము చేసుకుంటూ దోపిడీ చేస్తున్న వైనం నెలకొంది.

ప్రపంచాన్ని ఆవహించిన కరోనా నుంచి ఇప్పుడు టీకా తప్ప ఏదీ రక్షణ కల్పించలేదు. మందులు లేవు. చికిత్సా విధానం లేదు. దీంతో టీకానే మార్గంగా ఉంది. దీంతో ఇప్పుడు అందరూ టీకాల కోసం వెంపర్లాడుతున్నారు. దేశంలో టీకాల కొరతతో అస్సలు దొరకడం లేదు. దీన్నే కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు.

టీకాలు ఇప్పిస్తామంటూ ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబుకు ఓ వ్యక్తి టోకరా ఇచ్చిన వైనం సంచలనంగా మారింది. 500 డోసుల టీకాలు ఉన్నాయని సురేష్ బాబుకు నాగార్జునరెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తన భార్య బ్యాంకు ఖాతాకు రూ.లక్ష బదిలీ చేయాలని కోరాడు. అతడి మాటలు నమ్మి రూ.లక్ష బదిలీ చేశారు సురేష్ బాబు.

నగదు డ్రా చేసుకున్న తర్వాత నిందితుడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన సురేష్ బాబు నాగార్జునరెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

నాగార్జున రెడ్డిని నాలుగురోజుల క్రితమే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కేటీఆర్ పీఏనంటూ నమ్మించి మోసగించాడని తేలింది. ఇక ఓ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ ప్రతినిధిని టీకాల పేరుతో మోసగించినట్టు పోలీసులు విచారణలో తేల్చారు. ఇప్పుడు సురేష్ బాబును కూడా ఇలానే మోసం చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం సంగారెడ్డి జైలులో రిమాండ్ ఖైదీగా నాగార్జున రెడ్డి ఉన్నాడు.

Back to top button