టాలీవుడ్సినిమా

రష్మికు నందు ఘాటు ముద్దు !


హీరోగా నిలబడటానికి ‘నందు’ చేయని ప్రయత్నం లేదు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా హీరోగా మాత్రం సక్సెస్ కొట్టలేక, నందు బాగానే ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఎంత ఇబ్బంది పడినా, మళ్ళీ మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు. పైగా ఈ సినిమాలో హాట్ బ్యూటీ యాంకర్ రష్మి గౌతమ్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. దాంతో సోషల్ మీడియాలో ఈ సినిమాకి ఫ్రీగానే పబ్లిసిటీ దక్కుతుంది. మరి ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అంటూ రష్మితో వస్తోన్న నందు ఈ సారైనా బాక్సాఫీస్ వద్ద నిలబడగలడా..? సింగర్ గీతా మాధురి భర్తగా కాకుండా.. హీరో నందుగా గుర్తింపు తెచ్చుకోగలడా ? అయితే, మూవీ టైటిల్ దగ్గర నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ వరకూ ప్రతీ ఒక్కటి డిఫరెంట్‌ గానే ప్లాన్ చేసి విడుదల చేస్తూ.. యూత్ ను బాగానే ఆకట్టుకుంటున్నారు ఈ సినిమా యూనిట్.

Also Read: బోయపాటిని లైన్లో పెడుతున్న దిల్ రాజు.. కారణమేంటీ?

పైగా బీబీ అంటూ బిగ్ బాస్ సందడి నడుస్తున్న సమయంలోనే తన ‘బొమ్మ బ్లాక్ బస్టర్ (బీబీ)’ గురించి కూడా నందు తెలివిగా ప్రచారం చేసుకుంటూ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు. నిజానికి బీబీ అనే స్ట్రాటజీ కూడా బాగా వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది. ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే చిత్రం ఒకటి రాబోతుందనే విషయం జనానికి ఇప్పటికే చేరువైపోయింది. దీనికితోడు ఈ సినిమా టీజర్ కూడా ఓ రేంజ్‌లో క్లిక్ అవ్వడం.. పైగా టీజర్ లో రష్మీ, నందుల కెమిస్ట్రీ వేరే లెవెల్‌ లో హైలైట్ అవ్వడంతో.. ఓవరాల్ గా టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఇక ఫస్ట్ లుక్‌ తోనూ నందు – రష్మి కట్టిపడేశారు. వాణి పాత్రలో రష్మీ, పోతురాజు క్యారెక్టర్‌లో నందు జీవించేశారనే స్థాయిలో తమ పాత్రల్లోకి లీనం అయిపోయారు.

Also Read: మెగాస్టార్ ను దాటలేకపోతున్నా ఇప్పటి స్టార్స్ !

అయితే వాణి పాత్ర.. రష్మీకి మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉంది. పైగా ‘గొడవలంటే చాలా ఇష్టమండి’ అంటూ వయ్యారంగా రష్మి పలికిన డైలాగ్ కూడా బాగానే పేలింది. ఏది ఏమైనా ఈ సినిమా మాత్రం కుర్రాళ్లకు నచ్చుతుందని.. సినిమాలో రష్మీ – నందుల మధ్య రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘రాయే నువ్ రాయే’ అనే పాట రాబోతోందంటూ చిత్రబృందం ఓ పోస్టర్‌ ను విడుదల చేసింది. పోస్టర్‌లో రష్మీకి నందు ఘడంగా ఘాటైన ముద్దు పెడుతుండగా.. రష్మీ మందులో నీళ్లు కలుపుతూ తన రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్ తో పోస్టర్ కి మొత్తానికి గ్లామర్ ను అద్దింది.

Back to top button