టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

నాని ‘టక్ జగదీష్’ కూడా పాయే..

Nani ‘Tak Jagdish’ also in OTT

నేచురల్ స్టార్ నాని కూడా ఈ కరోనా కల్లోలంలో అనవసరంగా ప్రయోగాలు చేయకుండా చేతులు కాల్చుకోకూడదని డిసైడ్ అయ్యారు. అసలే కరోనా.. ఆపై థర్డ్ వేవ్ అంటూ ముసురుకొస్తున్న వేళ హీరో నాని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం ‘టక్ జగదీష్’ థియేటరికల్ రిలీజ్ కోసం ఎదురుచూసి ఇక కరోనాతో పరిస్థితులు మారే అవకాశాలు లేకపోవడంతో ఓటీటీకి వెళ్లిపోవాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

ఇప్పుడిప్పుడే థియేటర్లు పున: ప్రారంభం అవుతున్న తరుణంలో ‘టక్ జగదీశ్’ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా విడుదలపై పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ‘టక్ జగదీష్’ విడుదలపై పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుందని సమాచారం. ఇందుకోసం చిత్ర బృందానికి అమెజాన్ ప్రైమ్ భారీగా డబ్బు చెల్లించిందట..

అయితే ఓటీటీ విడుదల విషయంలో నానా, నిర్మాతలు తర్జనభర్జనలు పడుతున్నారని.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని తెలిసింది.

అయితే నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘మీట్-క్యూట్’ అనే చిత్రం మాత్రం ఖచ్చితంగా ఓటీటీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారని.. అది ఓటీటీ సంస్థతో డీల్ సెట్ అయిపోయిందని అంటున్నారు. త్వరలోనే ఆ వివరాలను చిత్రబృందం ప్రకటించబోతోందని తెలుస్తోంది.

ఇప్పటికే హీరో నాని నిర్మాతగా ప్రయోగాత్మక చిత్రాలు తీసి హిట్ కొట్టాడు. ‘హిట్’, ‘ఆ’ అనే చిత్రాలు తీశాడు. ఈసారి కూడా కొద్దిలాభాలకే తన ‘మీట్ క్యూట్’ను ఇచ్చేశాడని అంటున్నారు.

Back to top button