టాలీవుడ్సినిమా

డ్రగ్స్ ఆరోపణల పై నవదీప్ సెటైర్ !


నవదీప్ అంటనే ఇండస్ట్రీలో లవర్ బాయ్ అనే ఇమేజ్ ఉంది. పైగా నవదీప్ కాస్త బోల్డ్.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటాడు. అందకే నవదీప్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. అలాగే ప్రస్తుతం కూడా నవదీప్ తనకు సంబంధం లేకపోయినా డ్రగ్స్ కేసులో దూరి మరీ కామెంట్స్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బాగా వినిపిస్తోంది. రకుల్ కి డ్రగ్స్ కేసుకు ఇంతవరకు సంబంధం ఉన్నట్లు అధికారికంగా ప్రూవ్ అవ్వలేదు. కాకపోతే, సోషల్ మీడియాలో డ్రగ్స్ కేసులో రకుల్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు రాతల రాయుళ్లు. ముఖ్యంగా డ్రగ్స్ కేసు బాలీవుడ్ టు టాలీవుడ్ అంటూ హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ తో పాటు మంచు లక్ష్మీ, రానా, నవదీప్ వంటి పేర్లు కూడా సోషల్ మీడియాలో చర్చకొచ్చాయి.

Also Read: ‘సర్కారు వారి పాట’లో బాలీవుడ్‌ స్టార్స్‌

వచ్చాయి అనేకంటే వారిని కూడా ఈ రూమర్లల్లోకి లాక్కొచ్చారు అనడమే కరెక్ట్. దాంతో ఈ విషయం పై నెటిజన్లు చేసిన కామెంట్లకు నవదీప్ సమాధానమిచ్చాడు. నిజానికి పూరి మీద వచ్చిన డ్రగ్ ఆరోణల సమయంలోనే నవదీప్ కూడా డ్రగ్స్ కేసులో ఉన్నాడని రూమర్స్ వచ్చాయి. ఆ తరువాత అవి ఒట్టి రూమర్స్ గానే తేలిపోయాయి. అయినప్పటికీ అప్పటినుండీ టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ డ్రగ్స్ కేసులో చిక్కుకుని ఉన్నారనే మచ్చ మాత్రం వారి పై పోవడం లేదని.. వాళ్ళు కూడా తెగ ఫీల్ అవుతున్నారు. దీనికితోడు ఇప్పుడు రకుల్ పేరు డ్రగ్ కేసులో రావడంతో మళ్లీ టాలీవుడ్ లో డ్రగ్ వార్తలు, రూమర్స్ ఎక్కువైపోయాయి. ఇందులో భాగంగానే నవదీప్ పై ఓ నెటిజన్ ఓ కామెంట్ చేశాడు.

Also Read: భారీ ప్లాప్ డైరెక్టర్ కి మెగాస్టార్ ఛాన్స్.. కారణం ?

ప్రస్తుతం టాలీవుడ్ పై వస్తోన్న వార్తలు చూస్తుంటే.. నవదీప్ ఇప్పుడు జాగ్ర్తతగా ఉండాలేమో.. ఏంటి ఈ బాధలు నవదీప్ అంటూ ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. ఇలాంటి కామెంట్ కి ఎవ్వరూ రియాక్ట్ కారు. అనవసరంగా ఎందుకు కెలుక్కోవడం అని. కానీ , నవదీప్ మాత్రం ఆ కామెంట్‌ కు రియాక్ట్ అవుతూ.. ‘నాకేమీ బాధలేదని, మనం పనికొచ్చే పనులు చేద్దాం పదా అంటూ నెటిజన్ కు ఎదురు కౌంటర్ వేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా నవదీప్ మరో కామెంట్ కూడా పెట్టాడు. ‘మనుషులమైన మనం.. మనకు పూర్తిగా తెలియని వాటి గురించి మాట్లాడకూడుదు. నాకు అలా అనిపిస్తోంది. అవును అదే నిజమై ఉంటుంది నేనూ అదే అనుకుంటున్నాను. అసలు అలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అనే ఇలాంటి మాటలు మాట్లాడకండి. అంటూ అని అనవసర కామెంట్స్ పెట్టే నెటిజన్ల పై సెటైర్ వేశాడు నవదీప్.

Back to top button