టాలీవుడ్సినిమా

చిరుకి చెల్లిగా నయనతార !

Nayanthara
మెగాస్టార్ చిరంజీవి తన రీమేక్ “లూసిఫర్” సినిమాకి రేపు శ్రీకారం చుడుతూ లాంఛనంగా లాంఛ్ చేయబోతున్నారు. హైదరాబాద్ లోని మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆఫీస్ లో సింపుల్ గా పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కాగా చిరంజీవి, దర్శకుడు రాజా, నిర్మాత ఎన్వీ ప్రసాద్, మరికొద్ది అతిథుల సమక్షంలో ఈ సినిమా లాంచ్ అవ్వబోతుంది. ఇక రెగ్యులర్ షూటింగ్ ను మార్చి నెలలో మొదలుపెట్టి.. కేవలం నాలుగు నెలల్లోనే సినిమాని పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

Also Read: బాలయ్య అనగానే నో అంటున్న హీరోలు !

ఇక ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది. నయనతార… మెగాస్టార్ కి సిస్టర్ గా నటించబోతుంది. అలాగే మెయిన్ గా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర ఒకటి ఉంది. కథా పరంగా ఈ పాత్ర చాల కీలకంగా ఉంటుంది. కాగా సత్యదేవ్ ఆ అనుచరుడి పాత్రలో నటించబోతున్నాడు. ఎక్కువగా సినిమాలో హీరో ఏమి చేయడు, ఏం చేయాలన్నా తన అసిస్టెంట్ చేతే చేయిస్తూ.. తన హీరోయిజాన్ని ఆ రకంగా ఎలివేట్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి అలాంటి పాత్ర సత్యదేవ్ కి రావడం నిజంగా అతనికి మంచి అవకాశమే.

Also Read: మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ప్రారంభం

మొదట ఆ పాత్రలో బన్నీ అనుకున్నారు. తక్కువ నిడివి గల ఆ పాత్ర బన్నీ రేంజ్ కి సూట్ అవ్వదని చిరు ఫీల్ అవ్వడంతో… ఆ పాత్రలో సత్యదేవ్ ను తీసుకున్నారు. ఇక తమిళంలో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకుడు. మలయాళ సినిమా వర్షన్ సోల్ దెబ్బతినకుండా స్క్రిప్ట్ రెడీ చేశారట మోహన్ రాజా. ఆయన తమిళంలో “జయం” వంటి సినిమాలను సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button