గుసగుసలుటాలీవుడ్సినిమా

నయనతార, విఘ్నేశ్‌కు కరోనా…?


కరోనా వైరస్‌ దేశాన్ని కుదిపేస్తోంది. ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. సామాన్యులకే కాదు సెలబ్రిటీలను కూడా హడలెత్తిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు సినిమా రంగం బాగా దెబ్బతిన్నది. షూటింగ్స్‌ ఆగిపోవడంతో పలువురు ఉపాధి కోల్పోయారు. ఇంటి పట్టునే ఉన్నప్పటికీ పలువురు సినీ ప్రముఖులకు కరోనా సోకింది. ఈ వైరస్‌ వల్ల బాలీవుడ్‌లో కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా దక్షిణాది చిత్ర పరిశ్రమ పెద్దలు సైతం వైరస్‌ బారిన పడుతున్నారు. ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆయన తన ఇంట్లోనే ఉండి చికిత్స చేసుకుంటారు.

జగన్ టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు. ఆ రెండు పత్రికలు

మరోవైపు చెన్నైలో కోరలు చాస్తున్న కరోనా కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురికి సోకింది. లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె ప్రియుడు ప్రముఖ నిర్మాత విఘ్నేశ్‌ శివన్‌ కూడా కరోనా బారిన పడినట్టు వార్తలు రావడం సంచలనం సృష్టించింది. కొన్ని కొత్త సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనుల కోసం శివన్‌ ఇటీవల కొంత మంది సాంకేతిక నిపుణులను కలిశాడు. ఆయన కలిసిన వ్యక్తుల్లో ఒకరికి కరోనా పాటిజివ్‌ అని తేలింది. దాంతో విఘ్నేశ్‌కు కూడా పరీక్ష నిర్వహించగా.. వైరస్‌ నిర్దారణ అయినట్టు వార్తలు వచ్చాయి. అతను.. నయన్‌ను తరచూ కలుస్తుంటారు కాబట్టి ఆమెకు కూడా కరోనా సోకిందని కోలీవుడ్‌లో తెగ ప్రచార జరిగింది. ఈ ప్రేమ జంట త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు, ప్రార్థనలు కూడా ప్రారంభించారు. . ఈ విషయం నయన్‌, శివన్‌ తెలియడంతో వాళ్లు స్పందించారు. తమకు కరోనా సోకలేదని, ఇవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టిపారేశారు. తాము సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నామని పీఆర్ టీమ్‌ ద్వారా ప్రకటన ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

నయనతార –శివన్ ఓ గుళ్లో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. శివన్ ఇంట్లో పెళ్లి ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగా నయనతార కూడా పెళ్లి ప్రపోజల్ కి ఒప్పుకుంది అనే టాక్ నడిచింది. అయితే, రేపో మాపో పెళ్లి అనే వార్త హల్‌చల్‌ చేస్తుండగానే వాళ్లకు కరోనా వచ్చిందని పుకార్లు గుప్పుమనడం గమనార్హం.