విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త.. రూ.31,000 వేతనంతో ఉద్యోగాలు..?

Jobs on wooden block and magnifying glass on newspaper background
Jobs, recruitment

నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 120 సైట్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంజనీరింగ్ డిప్లొమా పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 14 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.nbccindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మొత్తం 120 ఉద్యోగ ఖాళీలలో సైట్‌ ఇన్‌స్పెక్టర్‌ (సివిల్‌) ఉద్యోగ ఖాళీలు 80 ఉండగా సైట్ ఇన్‌స్పెక్టర్‌ (ఎలక్ట్రికల్‌) ఉద్యోగ ఖాళీలు 40 ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సైట్‌ ఇన్‌స్పెక్టర్ ‌(సివిల్‌) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మూడేళ్ల ఫుల్‌టైం డిప్లొమా పాసై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు నాలుగు సంవత్సరాల అనుభవం ఉండాలి.

35 సంవత్సరాల లోపు వయస్సు ఉంటే మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 31,000 రూపాయల చొప్పున వేతనం లభిస్తుంది. సైట్‌ ఇన్‌స్పెక్టర్ ‌(ఎలక్ట్రికల్‌) ఉద్యోగాలకు 60 శాతం మార్కులతో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు కనీసం నాలుగేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు కూడా 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ కచ్చితంగా ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 31,000 రూపాయలు వేతనంగా లభిస్తాయి.

Back to top button