విద్య / ఉద్యోగాలు

ఎన్‌సీఎల్‌ లో 49 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రూ.2 లక్షల వేతనంతో..?

నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ అనుభవం ఉన్న ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ సంస్థ 49 మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఈ నోటిఫికేషన్ ద్వారా జీడీఎంఓ, డెంటిస్ట్, జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఏప్రిల్ 30వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.coalindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 49 పోస్టులలో మెడికల్‌ స్పెషలిస్ట్‌లు, మెడికల్‌ ఆఫీసర్ల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ/డీఎన్‌బీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.60,000 నుంచి రూ.2,00,000 వరకు వేతనం లభిస్తుంది. పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎన్‌సీఎల్, హెచ్‌క్యూ, సింగరాలీ, మధ్యప్రదేశ్‌–486889 అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. https://www.coalindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Back to top button