సినిమా వార్తలు

అది తప్ప.. ఇంకేదైనా అడగొచ్చు – శ్రీముఖి

Anchor Sreemukhi
హాట్ యాంకర్ శ్రీముఖికి ఈ మధ్య రెగ్యులర్ గా ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే.. పెళ్లి ఎప్పుడు ?. తానూ ఇప్పటికే ఎన్నో సార్లు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినా.. ఎవ్వరికీ అర్ధం కావడం లేదని.. అసలు తన పెళ్లి పై బయట వ్యక్తులకు ఎందుకు అంత ఆసక్తో తనకు అర్ధం కావడం లేదని.. ఇలాంటి ప్రశ్నలు ఇక నుండైనా వేయడం మానుకుంటే మంచింది అని శ్రీముఖి సీరియస్ అవుతుంది. శ్రీముఖి తన అభిమానులతో ఎప్పుడు చాటింగ్ చేసినా… వాళ్ళు ఈ ప్రశ్ననే అడుగుతున్నారు.

అందుకే.. ఈ సారి చాటింగ్ స్టార్ట్ చేసే ముందే… ఆ ప్రశ్న తప్ప ఇంకేదైనా అడగొచ్చు అని ఒక డిస్ క్లైమర్ పెడుతోంది ఈ హాట్ బ్యూటీ. 29 ఏళ్ల ఈ హాట్ యాంకర్ కి ఇన్ స్టాగ్రాంలో 34 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కువగా ఈ సోషల్ మీడియా వేదికని ఎంచుకొని అభిమానులతో కనెక్ట్ అవుతుంటుంది శ్రీముఖి. ఇక ఆమె డేటింగ్ గురించి ఇప్పటికే చాలా పుకార్లు వైరల్ అయ్యాయి అనుకోండి.

మరి ఆ పుకార్లల్లో నిజం ఉందేమో.. అందుకే ఆమె పెళ్లి ప్రస్తావన తెస్తే… చిరాకు పడుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్టు బుల్లితెర పై యాంకర్ గా పాపులరయిన శ్రీముఖి ఇటీవల వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టి.. సక్సెస్ ఫుల్ గా ఎంట్రప్రెన్యూర్ గా కూడా రాణిస్తోంది.

ఏది ఏమైనా శ్రీముఖిలో హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఉన్నా.. ఆమెను కేవలం హాట్ బ్యూటీగానే చూస్తున్నారు. ఎంత అందచందాలు ఉన్నా.. హీరోయిన్ గా మాత్రం ఆఫర్స్ రావడం లేదట. వెండితెరైనా బుల్లితెరైనా శ్రీముఖి తనకున్న గ్లామర్ ను ఒళ్ళు దాచుకోకుండా బాగానే ప్రదర్శన చేస్తోంది. అయినా హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడం బాధాకరమైన విషయమే.

Back to top button