టెక్నాలజీ

ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్..?

New Malware Found In Android Phones

దేశంలో స్మార్ట్ ఫోన్లు వినియోగించే వాళ్లలో ఎక్కువమంది ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారనే సంగతి తెలిసిందే. ఆఫిల్ ఫోన్లతో పోలిస్తే ఆండ్రాయిడ్ ఫోన్లు తక్కువ ధరకే లభిస్తూ ఉండటంతో చాలామంది ఈ ఫోన్లపై ఆసక్తి చూపుతున్నారు. అయితే టెక్ నిపుణులు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై కొత్త మాల్‌వేర్‌ దాడి చేయడానికి ప్రయత్నిస్తోందని సెక్యూరిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: మీ జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిందా.. ఏం చేయాలంటే..?

ఈ మాల్ వేర్ ఇతర మాల్ వేర్ లతో పోలిస్తే ఆండ్రాయిడ్ ఫోన్లపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని.. సిస్టమ్ అప్ డేట్ ఆప్షన్ ద్వారా ఫోన్లలో ఈ కొత్త మాల్ వేర్ ప్రవేశిస్తోందని తెలుస్తోంది. ప్రముఖ మొబైల్ సెక్యూరిటీ కంపెనీలలో ఒకటైన జింపెరియం ఈ విషయాన్ని వెల్లడించింది. జింపెరియం వెల్లడించిన నివేదిక ప్రకారం ఫోన్ లో ఈ మాల్ వేర్ ఉన్నా గుర్తించడం సులభం కాదు.

Also Read: వన్ ప్లస్ ఫోన్ ఫ్రీగా పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

ఈ మాల్ వేర్ ఫోన్ లోని డేటాతో పాటు ఫోటోలను, మెసేజ్ లను కూడా తస్కరిస్తుందని.. ఈ మాల్ వేర్ ద్వారా హ్యాకర్లు మొబైల్ ఫోన్ లోని డేటాను తమ అదుపులోకి తెచ్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ మాల్ వేర్ డిఫాల్ట్ గా ఉన్న బ్రౌజర్‌ సమాచారాన్ని , జీపీఎస్‌ లోకేషన్ ‌ను కూడా ట్రాక్ చేయనుందని నిపుణులు వెల్లడిస్తుండటం గమనార్హం. గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే యాప్ ల ద్వారా ఈ మాల్ వేర్ మొబైల్ లోకి ప్రవేశించదు.

థర్డ్ పార్టీ ఆండ్రాయిడ్‌ యాప్‌ లను ఫోన్ లో ఇన్ స్టాల్ చేస్తే మాత్రం స్మార్ట్ ఫోన్ లోకి వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతుండటంతో హ్యాకర్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.

Back to top button