విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త.. నిమ్స్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు..?

హైదరాబాద్‌ న‌గ‌రంలోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, సీనియ‌ర్ రెసిడెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జెరియాట్రిక్ మెడిసిన్‌లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 19వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. http://www.nims.edu.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా 040 – 23489353 నంబర్ కు కాల్ చేయడం ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల చాలామంది ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోతున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి సమయంలో ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పాలి. దేశంలో సంవత్సరం సంవత్సరానికి నిరుద్యోగుల శాతం ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే.

నిమ్స్ లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగ ఖాళీలు కాంట్రాక్ట్ ఉద్యోగాలే అయినప్పటికీ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనం చేకూరుతుంది.

Back to top button