అత్యంత ప్రజాదరణవిద్య / ఉద్యోగాలు

NLC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే జాబ్?

ప్రముఖ కంపెనీలలో ఒకటైన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(NLC) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 675 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

NLC Recruitment 2021 NLC Recruitment 2021: ప్రముఖ కంపెనీలలో ఒకటైన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(NLC) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 675 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు సంవత్సరం పాటు అప్రెంటీస్ గా పని చేయాల్సి ఉంటుంది. సంస్థ అవసరాన్ని బట్టి సర్వీసును పొడిగించటం జరుగుతుంది. ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. www.nlcindia.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టు, విద్యార్హతను బట్టి నెలకు రూ. 8,766, రూ. 10,019, రూ. 12,524 స్టైఫండ్ గా చెల్లించే అవకాశం ఉంటుంది. ఐటీఐ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

2019, 2020, 2021లో బీకామ్, బీఎస్సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ ఎల్ సీ అఫిషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 25 ఆగస్టు 2021 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రింట్ ఔట్, సంబంధిత డాక్యుమెంట్లను ఈ నెల 30వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ లో పూర్తి వివరాలను పరిశీలించి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.

Back to top button