విద్య / ఉద్యోగాలు

224 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ వేతనంతో..?

NMDC Recruitment 2021

ఎన్‌ఎండీసీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ నుంచి 224 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యుటివ్, ఇతర విభాగాలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ జరగనుందని సమాచారం.

Also Read: ఇంటర్, డిగ్రీ పాసయ్యారా.. 6552 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఏప్రిల్ 15 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. నాన్‌ఎగ్జిక్యూటివ్‌, ఇతర పోస్టులను రాతపరీక్ష ద్వారా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను మాత్రం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుంది. ఎగ్జిక్యూటివ్‌ పోసులు 97 ఉండగా సూపర్‌వైజర్‌ కమ్‌ చార్జ్‌మ్యాన్ ఉద్యోగాలు 71 ఉన్నాయి.

సీనియర్‌ టెక్నీషియన్‌ కమ్‌ ఆపరేటర్ ఉద్యోగాలు 27 ఉండగా టెక్నీషియన్‌ కమ్‌ ఆపరేటర్ ఉద్యోగాలు 15 ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 60,000 నుంచి 1,50,000 రూపాయల వరకు వేతనం కాగా సూపర్ వైజర్ కమ్ ఛార్జ్ మన్ ఉద్యోగాలకు 60,000 రూపాయల వేతనం లభిస్తుంది. సీనియర్ టెక్నీషియన్ కమ్ ఆపరేటర్ ఉద్యోగాలకు 50,000 వేతనం లభిస్తుండగా టెక్నీషియన్ కమ్ ఆపరేటర్ ఉద్యోగాలకు 40,000 వేతనం లభిస్తుంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఫుడ్ కార్పొరేషన్ లో 89 ఉద్యోగాలు..?

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పనికి తగిన వేతనం లభిస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేస్తే మంచిదని చెప్పవచ్చు.

Back to top button