జనరల్విద్య / ఉద్యోగాలు

బీఈ, బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. ఎన్‌ఎండీసీలో 67 ఉద్యోగాలు..?

NMDC Recruitment 2021.

నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 67 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఎన్‌ఎండీసీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్‌-2021 స్కోర్‌ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: ఇంటర్ సాఫ్ట్ వేర్ జాబ్ పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

67 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.nmdc.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను చేసుకోవచ్చు. మార్చి 1వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా మార్చి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: ఎన్టీపీసీలో 230 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వాళ్లు మాత్రమే అర్హులు..?

మొత్తం 67 ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రికల్‌ ఉద్యోగ ఖాళీలు 10, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్ 25, మెకానికల్‌ 14, మైనింగ్‌ 18 ఖాళీలు ఉన్నాయి. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపులు అమలవుతాయి.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైమ్‌ బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులైన వాళ్లు, ఎం.ఈ / ఎంటెక్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్‌-2021 పరీక్షకు హాజరైన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

Back to top button