ప్రత్యేకం

వ్యాక్సిన్ మార్కెట్లోకి రాకముందే నో స్టాక్..!

Corona Vaccine

కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడెక్కడ చూసినా ఇదే చర్చ. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. అగ్రదేశాలు సైతం కరోనా ధాటికి విలవిలాడిపోతున్నాయి. పేద, ధనిక, సామాన్యులు, సెలబ్రెటీలనే తేడా లేకుండా కరోనా బారినపడి మృతిచెందుతున్నారు. దీంతో ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. ఆయా దేశాలు లాక్డౌన్ పాటిస్తూ కొంతమేర కరోనా కట్టడి చేసున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో ప్రతీరోజు లక్షల్లో నమోదవుతుండటం శోచనీయంగా మారింది.

Also Read: రోగనిరోధక శక్తి వర్సెస్ కోవిద్

అగ్రరాజ్యం అమెరికా కరోనా కేసుల్లో తొలిస్థానంలో ఉండగా భారత్ రెండో ప్లేసు కోసం పోటీపడుతోంది. దేశంలో కరోనా కేసులు రోజుకు వేలల్లో నమోదువుతున్నాయి. మహరాష్ట్ర, గుజరాత్, చెన్నై, హైదరాబాద్, పుణే వంటి మెట్రోనగరాలతోపాటు పలు నగరాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదువుతున్నారు. ఇటీవల కాలంలో పల్లెల్లోనూ కేసులు సంఖ్య భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నా కేసులు సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.

కరోనా విషయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాక్సిన్ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వస్తుందని సైంటిస్టులు చెబుతుండటంతో ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కరోనాకు కొన్ని మందులు మార్కెట్లోకి వచ్చాయి. కరోనా చికిత్స కోసం అమెరికాకు చెందిన గిలాడ్ సైన్సెస్ అనే సంస్థ ‘రెమ్ డిసీవర్’ ఔషధాన్ని తయారు చేసింది. దీనిని ఇండియాలోని హెట్రో, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, సిప్లా, మిలన్ ఎన్వి ఫార్మా కంపెనీల ద్వారా మార్కెట్లో అందుబాటులో ఉంచేందుకు గెలాడ్ సంస్థ నిర్ణయించింది.

Also Read: కరోనా టెస్ట్ చేసినట్లు సర్టిఫికెట్ ఉంటేనే 108 వచ్చేది?

ఈ మందును కేవలం కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే విక్రయిస్తున్నారు. మెడికల్ ప్రిస్క్రిప్షన్, వైద్యుల సూచన డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఆన్లైన్లో పేమెంట్స్ చేస్తే హెట్రో ఫార్మా హోం డెలివరీ చేస్తుంది. చాలామంది కరోనా పేషంట్లు ఆన్ లైన్లోనే ఈ ఔషధాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా అవుటాఫ్ స్టాక్ అని చూపిస్తుందట. డిమాండ్ కు తగ్గ సప్లయ్ కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది నిరాశ చెందుతోన్నారు.

Tags
Show More
Back to top button
Close
Close