కరోనా వైరస్వ్యాపారము

కరోనా వల్ల ఆర్థిక సమస్యలా.. డబ్బు పొందే మార్గాలు ఇవే..?

దేశంలో కరోనా మహమ్మారి ప్రజలు ఊహించని స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. కరోనా వల్ల ప్రజలకు ఖర్చులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇంట్లో ఒకరికి కరోనా సోకినా మెడిసిన్స్, ట్రావెల్ ఖర్చులు, ఇతర ఖర్చుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పెరిగిన నిత్యావసరాల ధరల వల్ల సామాన్యులపై భారం మరింత పెరుగుతోంది. అత్యవసరం వస్తే డబ్బులు లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఉద్యోగాలు చేసే వాళ్లు డబ్బులను సులభంగా పొందేందుకు నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రొవిడెంట్ ఫండ్ ఖాతా కచ్చితంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. డబ్బు అత్యవసరం అయితే పీఎఫ్ డబ్బుల్లోంచి కొంత మొత్తాన్ని మంచిదని నిపుణులు సూచనలు చేస్తున్నారు.

భవిష్యత్ అవసరాల కొరకు కొంతమంది బ్యాంకుల్లో కొంత మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో మెడికల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసరాల నిమిత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్లను విత్ డ్రా చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్లు ఉంటే అవసరమైతే ఆ మొత్తాన్ని కూడా విత్ డ్రా చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మ్యూచువల్ ఫండ్స్‌ యూనిట్లను అమ్మడం ద్వారా కూడా కరోనా కష్ట కాలంలో అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. ప్రస్తుతం నెలకొన్న వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఈ మార్గాన్ని వాడుకుంటే మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Back to top button